మెగాస్టార్ చిరంజీవి.. సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈ ఇద్దరు హీరోలకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక మహేష్ బాబు రాజమౌళి సినిమాతో పాన్ వరల్డ్ ను టచ్ చేయబోతున్నాడు.. అది వేరే విషయం.. అయితే ఈ ఇద్దరు హీరోల ఇమేజ్ లతో ఒక సినిమా బయటకు వస్తే.. ఎలా ఉంటుంది. ఆ సినిమా ఎంత సక్సెస్ సాధిస్తుంది..? ఆక్రేజ్ ఎక్కడివరకూ వెళ్తుంది.. కాని ఇద్దరు సినిమాలు దగ్గరగా వచ్చి మిస్ అయ్యాయని మీకు తెలుసా..?
Mahesh babu
అవును ఈ ఇద్దరు హీరోలు గతంతో విడివిడిగా మల్టీ స్టారర్ మూవీస్ చేసినవారు. ఇక మహేష్ బాబు అయితే వెంకటేష్ తో కలిసి చేసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తెలుగువారి మనసుల్లో ఎలాంటి ముద్ర వేసుకుందో తెలిసిందే. అయితే ఈ ఇద్దరు స్టార్స్ తో మల్టీ స్టారర్ సినిమా రెండు సార్లు మిస్ అయ్యింది. ఒక సారి నిర్మాత సుబ్బిరామిరెడ్డి మెగా హీరోలు అయిన చిరు- పవన్ లతో మల్టీ స్టారర్ చేయాలి అనుకున్నాడట. కాని అది కుదరకపోవడంతో.. వవన్ స్థానంలో మహేష్ బాబును తీసుకుని చేయాలి అనుకున్నాడట.
అంతే కాదు ఈసినిమా చేసే బాధ్యత కూడా మాటల మాత్రికుడు త్రివిక్రమ్ కు అప్పజెప్పారట. కాని కథ విషయంలో గురి కుదరలేదట గురూజీకి. దాంతో ఈసినిమాకు చాలా వర్క్ చేయాల్సి ఉంది. అంత పెద్ద ఇమేజ్ లను ఒక ఫ్రేమ్ లో చూపించడం అంటే దానికి చాలా బ్యాగ్రౌండ్ వర్క్ చేయాలి అని.. దానికి టైమ్ కావాలి అన్నారట.
దాంతో తరువాత తరువాత అంటూనే ఈ సినిమా అలా అలానే మరుగున పడిపోయింది. ముందు ముందు ఈ కథ బయటకు వచ్చి.. ఈ ఇద్దరు కాంబో వస్తున్నందన నమ్మకం లేదు. ఇక మరో సినిమా కూడా వీరి కాంబోలో మిస్ అయ్యిందట. అది ఏ సినిమానో కాదు ఆచార్య. అవును చిరంజీవి హీరోగా కొరటా శివ డైరెక్ట్ చేసిన డిజాస్టర్ మూవీ ఆచార్యాలో.. చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా నటించిన సంగతి తెలిసిందే.
అయితే ఈసినిమాలో చరణ్ పాత్ర కోసం ముందు మహేష్ బాబును అనుకున్నాడట కొరటాల. కథ కూడా వినిపించాడట. అయితే కొరటాలతో తనకు ఉన్న అనుబంధం, మహేష్ ను రెండు సార్లు ప్లాప్ ల నుంచి కాపాడటంతో.. ఆ గౌరవంతో మహేష్ బాబు ఆచార్య సినిమా చేయడానికి ఒప్పుకున్నాడని టాక్.
కాని ఈ సినిమాలో ఆచార్యగా చిరంజీవి.. సిద్ద పాత్ర కోసం రామ్ చరణ్ కావాలని మెగాస్టార్ పట్టుబట్టి రామ్ చరణ్ తో ఈ పాత్ర చేయించారట. అంతే కాదు ఆ టైమ్ లో రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ బిజీలో ఉండగా.. రాజమౌళిని బ్రతిమలాడి మరీ డేట్స్ తీసుకున్నాడ చిరు. ఈ విషయంలో చరణ్ పై జక్కన్న కొప్పడ్డారని.. వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని కూడా టాక్ నడిచింది. అయితే ఎలాగో అలా చరణ్ డేట్స్ తీసుకుని ఈసినిమా పూర్తి చేశారు.
అలా ఆచార్య ను కూడా మహేష్ మిస్ అయ్యాడని టాలీవుడ్ టాక్. ఒక వేళ ఇది నిజమే అయితే.. ఓ పెద్ద డిజాస్టర్ నుంచి మహేష్ బయటపడ్డట్టే. ఇలా రెండు సార్లు వీరి కాంబో మిస్ అయ్యిందట. ముందు ముందు కూడా వీరి కాంబినేషన్ కనిపించే అవకాశం లేదు అని చెప్పాలి.
\ఎందుకంటే మహేష్ బాబు రాజమౌళి దగ్గర లాక్ అవుతున్నాడు. ఈసినిమా కంప్లీట్ అవ్వడానికి ఏడెనిమదేళ్లు పడుతుందని టాక్. రెండుభాగాలు.. భారీ బడ్జెట్ కావడంతో.. హాలీవుడ్ రేంజ్ సినిమా అవ్వడంతో ఇంకా టైమ్ పట్టే అవకాశం ఉంది. సో మెగా మూవీ కష్టమనే చెప్పాలి.
Chiranjeevi, vishwambara, release date
ఇక ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతుండగా.. మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఈమూవీ వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూశారు. కాని రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కోసం చిరంజీవి త్యాగం చేసి.. సమ్మర్ కు వెళ్లిపోయాడు.