Food
వైట్ పాస్తా చాలా టేస్టీగా ఉంటుంది. కానీ దీనిలో ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఎక్కువగా తింటే ఫ్రీ మోషన్ రాదు.
ప్రాసెస్ చేసిన ఫుడ్ ను చాలా మంది ఇష్టంగా తింటారు. ఇది టేస్టీగా ఉన్నా దీనిలో ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. అనారోగ్యకరమైన ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మలబద్దకాన్ని కలిగిస్తాయి.
నూనెలో వేయించిన ఆహాారాలు ఎంత టేస్టీగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వీటిని తింటే కొంతమందికి ఫ్రీ మోషన్స్ కావు.
వైట్ బ్రెడ్ లో షుగర్ కంటెంట్ ఎక్కువగా, ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తింటే కొంతమందికి మలబద్దకం సమస్య వస్తుంది.
షుగర్ ఎక్కువగా ఉన్న చాక్లెట్, కుకీస్, పేస్ట్రీ వంటి ఆహారాలను ఎక్కువగా తింటే కూడా కొంతమందికి మలబద్దకం సమస్య వస్తుంది.
రెడ్ మీట్ ను చాలా మంది ఇష్టంగా తింటారు. కానీ దీనిలో అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా, ఫైబర్ తక్కువగా ఉంటుంది. అందుకే ఇది కూడా మలబద్దకానికి దారితీస్తుంది.
శీతల పానీయాలయలో కొవ్వు, ఉప్పు, చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తాగిన వారికి మలబద్దకం సమస్య వస్తుంది.