ఒక బ్యాంకులో ఎన్ని సేవింగ్స్ అకౌంట్స్ ఉండొచ్చు?

First Published | Dec 14, 2024, 11:03 AM IST

ఎవరికైనా ఒక బ్యాంకులో ఒకటే సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది కదా? కాని రెండు అంతకంటే ఎక్కువ అకౌంట్స్ మెయింటెయిన్ చేయొచ్చని మీకు తెలుసా? ఇలా ఎక్కువ అకౌంట్స్ ఎందుకు పెట్టుకోవాలి? వాటి వల్ల కలిగే లాభనష్టాల గురించి ఇక్కడ క్లియర్ గా తెలుసుకుందాం. 

ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే ప్రతి ఒక్కరికీ బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్స్ ఉంటాయి. పెద్ద స్థాయిలో బిజినెస్ చేసే వారు కరెంట్ అకౌంట్స్ ని కూడా మెయింటెయిన్ చేస్తారు. ఇవి రెగ్యులర్ లావాదేవీలకు ఎక్కువగా ఉపయోగపడతాయి. అయితే సేవింగ్స్ అకౌంట్స్ ఫిక్స్‌డ్ ఆదాయం నిల్వ చేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఈ అకౌంట్ లో ఉండే అమౌంట్ ను డెబిట్ కార్డ్ ద్వారా ఎప్పుడైనా, ఎక్కడైనా సులభంగా విత్ డ్రా చేసుకోవచ్చు. 

ఇలాంటి సేవింగ్స్ అకౌంట్ ని ఎవరైనా ఒకటే మెయింటెయిన్ చేస్తారు. జనరల్ గా వేర్వేరు బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్స్ ఉంటాయి. ఇది సాధారణం. అయితే చాలా మంది వారి అవసరాలను తీర్చడానికి రెండు ఖాతాలను కూడా తెరుస్తారు. ఇలా ఒకే బ్యాంకులో రెండు సేవింగ్స్ ఖాతాలను కలిగి ఉండటం వల్ల కలిగే లాభాలు, నష్టాల గురించి వివరంగా తెలుసుకుందాం. 

మీరు ఒక బ్యాంకులో రెండు, మూడు సేవింగ్స్ అకౌంట్స్ ని కూడా నిర్వహించవచ్చు. చాలా బ్యాంకులు అకౌంట్స్ మెయింటెయిన్ చేయడానికి లిమిట్ పెట్టవు. అయితే కొందరు వ్యక్తులు వివిధ ప్రయోజనాల కోసం అనేక ఖాతాలను ఓపెన్ చేస్తుంటారు. 

Tap to resize

ఎక్కువ సేవింగ్స్ అకౌంట్స్ వల్ల ప్రయోజనాలు 

1. రోజువారీ ఖర్చులకు, పిల్లల చదువులకు, వ్యాపార లావాదేవీలకు ఇలా డబ్బులను వేరు వేరు అకౌంట్స్ లో వేసుకోవడం వల్ల క్లారిటీ ఉంటుంది. 
2. ఎక్కువ అకౌంట్స్ ఉండటం వల్ల వివిధ రకాల వడ్డీ రేట్లు పొందడానికి వీలుంటుంది. అంతేకాకుండా ప్రభుత్వాలు ఇచ్చే వివిధ పథకాలను కూడా ఉపయోగించుకోవచ్చు. 

3. ఒక అకౌంట్ లో సమస్య వచ్చినప్పుడు రెండో అకౌంట్ ను ఉపయోగించుకోవచ్చు. 

ఎక్కువ అకౌంట్స్ వల్ల నష్టాలు

1. సాధారణంగా రెండు ఖాతాలను మెయింటెయిన్ చేయడం కష్టంగా ఉంటుంది. బ్యాలెన్స్‌లు, లావాదేవీలు, స్టేట్‌మెంట్‌లను ట్రాక్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 

2. మినిమం బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకపోతే బ్యాంకులు ఫైన్ లు వేస్తాయి. ఇవి సరిగా చూసుకోకపోతే  ఫైన్లు కడుతూ ఎక్కువ డబ్బులు పోగొట్టుకోవాల్సి వస్తుంది. 

అందువల్ల మీకు అవసరం అనుకుంటేనే రెండు, మూడు అకౌంట్స్ తీసుకోండి. లేకపోతే వాటిని మెయింటెయిన్ చేయడం కష్టంగా మారి ఫైన్లు కడుతూ ఉండాల్సి ఉంటుంది. 

Latest Videos

click me!