అసలు నిరంజన్ రెడ్డి ఎవరు, బన్నీ కేసు వాదించేందుకు లాయర్ ని పెట్టింది చిరంజీవేనా.. ఫీజు ఎంతో తెలుసా ?

First Published | Dec 14, 2024, 9:53 AM IST

నిరంజన్ రెడ్డి నిర్మాతగా సినీ ప్రేక్షకులకు సుపరిచయమే. మెగా ఫ్యామిలీతో అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి నిరంజన్ రెడ్డి. లాయర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ అక్కడికి అనుమతి లేకుండా వెళ్లడం వల్ల ఈ సంఘటన జరిగింది అని పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం జరిగింది. కొన్ని గంటల తర్వాత హైకోర్టు బన్నీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో హైలైట్ అయిన మరో వ్యక్తి కూడా ఉన్నారు. ఆయనే బన్నీ తరుపున బెయిల్ కోసం వాదించిన లాయర్ నిరంజన్ రెడ్డి. 

నిరంజన్ రెడ్డి నిర్మాతగా సినీ ప్రేక్షకులకు సుపరిచయమే. మెగా ఫ్యామిలీతో అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి నిరంజన్ రెడ్డి. లాయర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు. హైకోర్టులో బలంగా వాదన వినిపించిన నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ వచ్చేలా కీలక పాత్ర పోషించారు. మెగాస్టార్ చిరంజీవి సన్నిహితుడిగా, లీగల్ అడ్వైజర్ గా చాలా కాలంగా పనిచేస్తున్నారు. 

Tap to resize

అల్లు అర్జున్ తరుపున హైకోర్టులో కేసు వాదించాలని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి.. నిరంజన్ రెడ్డిని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో నిరంజన్ రెడ్డి రంగంలోకి దిగారు. బలమైన పాయింట్స్ ని నిరంజన్ రెడ్డి కోర్టు ముందు ప్రస్తావించారు. 14 రోజుల పాటు బన్నీ జైల్లో ఉండాల్సిందేనా అని అభిమానులు కంగారు పడుతున్న సమయంలో నిరంజన్ రెడ్డి తన ప్రతిభతో మధ్యంతర బెయిల్ వచ్చేలా చేశారు. 

చివరికి షారుఖ్ ఖాన్ రాయిస్ చిత్ర కేసుని కూడా కోర్టు ముందు నిరంజన్ రెడ్డి ఉదహరించడం విశేషం. 2017లో రాయిస్ ప్రమోషన్స్ లో షారుఖ్ ఖాన్ పాల్గొన్నప్పుడు ఇలాంటి సంఘటనే జరిగింది అని నిరంజన్ రెడ్డి కోర్టులో తెలిపారు. ఆ సమయంలో కోర్టు షారుఖ్ ఖాన్ కి అనుకూలంగా తీర్పు ఇచ్చిన విషయాన్ని నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. ఇండియాలో క్రికెట్ మ్యాచ్ లు జరుగుతున్నప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని నిరంజన్ రెడ్డి కోర్టు ముందు తెలిపారు. 

ఇలాంటి యాక్సిడెంటల్ సంఘటనలు జరిగినప్పుడు దానిని పూర్తిగా స్టార్లకి ఆపాదించడం సరైనది కాదని నిరంజన్ రెడ్డి అన్నారు. దీనితో నిరంజన్ రెడ్డి వాదనలతో ఏకీభవించిన కోర్టు బన్నీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీనితో ఒక్కసారిగా నిరంజన్ రెడ్డి సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారారు. నిరంజన్ రెడ్డిని బన్నీ కేసు కోసం సిఫార్సు చేసింది చిరంజీవే అనే విషయం కూడా వెలుగులోకి వచ్చింది. 

నిరంజన్ రెడ్డి బాగా కాస్ట్లీ అని తెలుస్తోంది. ఒక గంట హియరింగ్ కి ఆయన 5 లక్షల వరకు ఛార్జ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. నిరంజన్ రెడ్డి గగనం చిత్రంతో నిర్మాతగా మారారు. ఆ తర్వాత క్షణం, ఘాజి, వైల్డ్ డాగ్ లాంటి చిత్రాలని నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రాన్ని నిర్మించింది ఆయనే. కానీ ఆచార్య చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. 

Latest Videos

click me!