Jul 4, 2020, 10:40 AM IST
జగిత్యాల జిల్లా, కోరుట్ల కల్లూర్ రోడ్డులో ఉన్న ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు క్యాంప్ కార్యాలయంపై దాడి చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో దాడికి పాల్పడ్డట్లు అడిషనల్ ఎస్పీ దక్షిణామూర్తి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దీపక్, శ్రీకాంత్, ప్రవీణ్ కుమార్ అనే ముగ్గురు యువకులు తాగిన మైకంలో ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో చేశారని తెలిపారు. బుధవారం రాత్రి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన తెలిసిందే.