Feb 3, 2021, 12:55 PM IST
ఒంటరిగా కనిపించిన యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడిన కామాందుడు దారుణానికి ఒడిగట్టాడు. బాలికను అనుభవించాలన్న కోరిక నెరవేరక పోవడంతో కిరాతకంగా వ్యవహరించిన ప్రాణాలను బలితీసుకున్నాడు. ఈ దారుణం రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. తంగళ్లపల్లి మండలం కేంద్రంలో నివాసముండే మైనర్ బాలిక మధుమిత(15) కు మాయమాటలు చెప్పి బండి రాజు అనే యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా బాలికకు పురుగుల మందు త్రాగించి ఆ తర్వాత అతడు కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వారిద్దరిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా ఇవాళ యువతి ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందింది. దీంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.