Jul 4, 2020, 11:09 AM IST
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట సోమవారంపేటలో భూ వివాదం దాడులకు దారి తీసింది. గ్రామంలో రెండు కుటుంబాల మద్య గత కొన్ని సంవత్సరాలుగా భూవివాదం ఉంది. కాగా, ఆ భూమిలో ఐరెడ్డి సాయిచంద్ రెడ్డి, ఐరెడ్డి సులోచనలు వ్యవసాయ పనులు చేస్తుండగా, గమనించిన ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు కారంపొడి, గొడ్డళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో సాయిచంద్ రెడ్డి, సులోచనలు తీవ్రంగా గాయపడడంతో, వారిని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు.ఐరెడ్డి సత్తిరెడ్డి, సురేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి లు కలిసి కర్రలతో సాయి, సులోచనలపై దాడి చేశారని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇల్లంతకుంట మండలం పోలీసులు దాడి చేసిన వారిదగ్గరి నుండి కారంపొడి, గొడ్డలను స్వాధీన పరుచుకుని కేసు నమోదు చేశారు.