Galam Venkata Rao | Published: Feb 21, 2025, 10:00 PM IST
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గత పదేళ్లలో తెలంగాణలో పేదలకు ప్రభుత్వ ఇళ్లు దక్కలేదన్నారు. గత పాలకులు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో ఎన్నడూ పట్టించుకోలేదన్నారు. పాలమూరుకు శాపం కేసీఆర్ పాపమేనన్న రేవంత్ రెడ్డి.. జగన్ కృష్ణా జలాలను రాయలసీమకు తరలించుకుపోతుంటే కేసీఆర్ ఇంటికి పిలిచి పంచభక్ష్య పరమాన్నాలు పెట్టి పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 ఏండ్ల మోడీ పాలన మీద, 10 ఏండ్ల కేసీఆర్ పాలన మీద, మా 12 నెలల పాలన మీద చర్చ చేసేందుకు తాము సిద్ధం అని కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, బండి సంజయ్, కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు.