ప్రణీత సుభాష్ కొడుకు నామకరణ వేడుక.. హాజరైన సినీ సెలెబ్రిటీలు, ఏం పేరు పెట్టారో తెలుసా
ప్రముఖ నటి ప్రణీత సుభాష్ తన కుమారుడి నామకరణ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
ప్రముఖ నటి ప్రణీత సుభాష్ తన కుమారుడి నామకరణ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
నటి ప్రణీత సుభాష్ కుమారుడి నామకరణ వేడుక ఘనంగా జరిగింది. పలువురు సినీ తారలు హాజరయ్యారు.ప్రణీత సుభాష్ దంపతులు ఈ వేడుకలో సాంప్రదాయ వస్త్ర ధారణలో మెరిశారు.
బెంగళూరులోని ఓ ప్రైవేట్ హోటల్‌లో నామకరణ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ తారలు హాజరయ్యారు.
వేడుకలో నటి రమ్య, డాలి ధనంజయ్ తదితరులు పాల్గొన్నారు.కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి పలువురు నటీనటులు హాజరయ్యారు.
నటి శృతి, ఆమె కుమార్తె గౌరి, నటి మాళవిక, జయమాల, దర్శకుడు యోగరాజ్ భట్, ధన్య రామ్ కుమార్ తదితరులు హాజరయ్యారు.
నటి కావ్య శా, మాన్విత కామత్, సంయుక్త హొరనాడు తదితరులు హాజరయ్యారు.ప్రణీత దంపతులు ప్రతి సెలెబ్రిటీతో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
ప్రణీత తన కుమారుడికి జై కృష్ణ నితిన్ రాజ్ అని పేరు పెట్టారు.ప్రణీత తెలుగులో అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, బ్రహ్మోత్సవం లాంటి చిత్రాల్లో నటించింది.
ప్రణీతకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె పేరు ఆర్న. ఆమె వయసు రెండేళ్లు.ప్రణీత 2021లో నితిన్ రాజ్ అనే వ్యాపారవేత్తని వివాహం చేసుకుంది.
ప్రణీత సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. ప్రస్తుతం ఫ్యాషన్ షోలలో పాల్గొంటున్నారు.పెళ్లి తర్వాత ప్రణీత సినిమాలకు దూరంగా ఉంటోంది.
పిల్లలు పుట్టిన తర్వాత నటనకు దూరంగా ఉన్న ప్రణీత, ఇప్పుడు మళ్లీ సినిమాలలోకి రావడానికి సిద్ధమవుతున్నారు.
ప్రణీత సోషల్ మీడియాలో తన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తుంటారు.ప్రణీతని తెలుగు అభిమానులు బాపు బొమ్మ అని ముద్దుగా పిలుస్తుంటారు.