Padutha Theeyaga
బుల్లితెరపై వచ్చే షోలు కొన్ని మాత్రమే జనాల్లోకి బాగా వెళ్లి పాపులర్ అవుతుంటాయి. కొన్ని షోలు వస్తున్నాయంటే ఆడియన్స్ టీవీలకు అతుక్కుపోతారు. ఆ విధంగా సక్సెస్ అయిన టివి షోలలో పాడుతా తీయగా ఒకటి. ముఖ్యంగా సంగీత ప్రియులు ఈ షోని చూడడానికి ఇష్టపడుతుంటారు. యూట్యూబ్ లో కూడా మంచి వ్యూస్ వస్తుంటాయి. ఒకప్పుడు ఈ షోకి లెజెండ్రీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జడ్జిగా వ్యవహరించారు.
Padutha Teeyaga
పాడుతా తీయగా షోలో చీకటి కోణం
ప్రస్తుతం ఈ షోలో కీరవాణి, సునీత, చంద్రబోస్ న్యాయనిర్ణేతలుగా ఉన్నారు. పాడుతా తీయగా షో సిల్వర్ జూబ్లీ సిరీస్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ సీరీస్ లో తనకి అన్యాయం జరిగింది అంటూ సింగర్ ప్రవస్తి ఆరాధ్య సంచలన వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ప్రవస్తి.. జడ్జీలు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ లో జరుగుతున్న చీకటి కోణాన్ని బయట పెట్టే ప్రయత్నం చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఏకంగా కీరవాణి, చంద్రబోస్, సునీతపై విమర్శలు చేసింది.
Padutha Teeyaga
వివక్ష చూపుతున్న జడ్జ్ లు
ప్రవస్తి స్టార్ మా లో సూపర్ సింగర్ 2024 విజేతగా నిలిచింది. పాడుతా తీయగా షో గతంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ఉన్నప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు అలా లేదు అని ప్రవస్తి పేర్కొంది. పాడుతా తీయగా షో సిల్వర్ జూబ్లీ సిరీస్ వల్ల మెంటల్ గా డిస్ట్రబ్ అయ్యాను. జడ్జీలు ఈ షోలో వివక్ష చూపుతున్నారు. జడ్జీలు నన్ను ఒక చీడ పురుగుని చూసినట్లు చూశారు. సింగర్ సునీత అయితే.. కీరవాణి గారికి నా గురించి లేనిపోనివి అన్నీ కల్పించి చెప్పారు. నన్ను బాడీ షేమింగ్ చేస్తూ కూడా మాట్లాడారు. శ్వేతా మోహన్ లాంటి సింగర్లు నన్ను అభినందించారు. కానీ పాడుతా తీయగా షోలో జడ్జీలకు నాపై ఎందుకు అంత కక్ష అనేది అర్థం కావడం లేదు.
Singer Sunitha
ఎక్స్ ఫోజింగ్ చేయమని చెబుతారు
పాడుతా తీయగా ప్రొడక్షన్ అయితే వరస్ట్. వాళ్ళు మాకు కాస్ట్యుమ్స్ ఇచ్చి నడుము కిందికి శారీ కట్టుకోండి, ఎక్స్ ఫోజింగ్ చేయండి అని చెబుతారు. కాస్ట్యూమ్ డిజైనర్ అయితే.. నీకున్న బాడీకి ఇంకేమి ఇవ్వగలను అంటూ అసభ్యంగా మాట్లాడాడు. వీళ్ళ మాటల వల్ల నా కాన్ఫిడెన్స్ మొత్తం పోయింది. డిప్రెషన్ కి గురయ్యాను. బాలు సార్ ఉన్నప్పుడు ఇలాంటి చెత్త అంతా లేదు. కానీ ఎప్పుడైతే ప్రొడక్షన్ లోకి జ్ఞాపిక ప్రొడక్షన్స్ వాళ్ళు వచ్చారో అప్పటి నుంచి పాడుతా తీయగా షో వరస్ట్ గా మారింది.
సింగర్ సునీతకి నేనంటే పడదు
సింగర్ సునీత గారికి అయితే నేను అంటేనే పడదు. నన్ను చూసేసమయంలో ముఖం అదో విధంగా పెట్టి చూస్తారు. కావాలనే నా సాంగ్ కి నెగిటివ్ కామెంట్స్ ఇస్తారు. ఒకసారి ఆమె మైక్ ఆపడం మరచిపోయింది. ఆ టైంలో నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉన్నా. ఈ అమ్మాయికి అసలు వాయిస్ లో బేస్ లేదు. కానీ మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది అంటూ కీరవాణికి నెగిటివ్ గా చెప్పింది. ఇయర్ ఫోన్స్ లో ఆ మాటలు నాకు వినిపించాయి అని ప్రవస్తి పేర్కొంది.
నా పాటపై నెగిటివ్ కామెంట్స్
శ్రీరామదాసు చిత్రంలో అంతా రామమయం అనే సాంగ్ పాడాను. అది మేల్ సాంగ్. అంతకు ముందు నేను ఎలాంటి సాంగ్ ఇచ్చినా దానిని రిజెక్ట్ చేశారు. అది శ్రీరాముడు రౌండ్ కాబట్టి రాముడి పాటలే ఎంచుకోవాలి. చివరికి అంతా రామమయం సాంగ్ ఇచ్చాను. దానిని సెలెక్ట్ చేశారు. అది మేల్ సాంగ్ కాబట్టి నేను పాడితే ఎంతో కొంత తేడా ఉంటుంది. దానిని పట్టుకుని ముగ్గురు జడ్జీలు నాకు నెగిటివ్ కామెంట్స్ ఇచ్చారు. సునీత, కీరవాణి ఏదో మేనేజ్ చేశావు అని అన్నారు. చంద్రబోస్ అయితే నీ వాయిస్ లో ఆర్ద్రత లేదు అని అన్నారు. అంతకు ముందు ఒక అమ్మాయి సాంగ్ పాడుతూ లిరిక్స్ మరచిపోయింది. ఆ అమ్మాయిని ఏమీ అనలేదు. నాపై ఇంత పక్షపాతం ఎందుకో అర్థం కావడం లేదు అని ప్రవస్తి ఆవేదన వ్యక్తం చేసింది.
సింగర్ ప్రవస్తి వీడియో ఇక్కడ చూడండి .