వేపుడు పదార్థాలతో కలిపి..
వేయించిన ఆహారాలు, స్పైసీ ఫుడ్స్‌తో కలిపి రొయ్యలు అస్సలు తినకూడదు. రొయ్యలతో పాటు లేదా రొయ్యలు తిన్న అనంతరం వేయించిన ఆహారాలు, మసాలా ఫుడ్స్ తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. కడుపు ఉబ్బరంగా, అసౌకర్యం ఉంటుంది. కొందరికి కడుపు నొప్పి కూడా రావచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటికి దూరంగా ఉండండి.
పాలు డేంజర్
మాంసాహారం తిన్న తర్వాత పాలు తాగకూడదని వైద్య నిపుణులు చెబుతుంటారు. రొయ్యలను తిన్న తర్వాత పాలు తాగినా ఇదే ఫలితం. అలా చేస్తే అలర్జీలు వస్తాయి. పాల ఉత్పత్తులలోని కాల్షియం రొయ్యలలోని ప్రోటీన్లతో చర్య జరిపి కడుపులో జీర్ణక్రియకు అడ్డుపడుతుంది. ఈ కాంబినేషన్ ఎక్కువ కాలం కొనసాగితే అల్సర్లకు దారి తీసే ప్రమాదం ఉంది. పొత్తికడుపు నొప్పి, వికారం, అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం, శరీరం నుంచి చెడు వాసన, మలబద్ధకం, చర్మ సమస్యలు.. వీటన్నింటికీ ఆస్కారం ఉందని వైద్య నిపుణులు చెబుతారు.
ఐరన్ పదార్థాలు అసలే వద్దు
రొయ్యలతో కలిపి, రొయ్యలు తిన్న తర్వాత ఐరన్ ఉండే ఆహారాలు అసలు తినొద్దు. రొయ్యల్లో సహజంగానే ఐరన్ ఉంటుంది. రక్తహీనత, ఐరన్ లోపం ఉన్నవారికి మాంసం లేదా పాలకూరతో కలిపి తీసుకుంటే చాలా మంచిది. కానీ ఐరన్ లోపం లేనివారు ఈ కాంబినేషన్లో తీసుకుంటే హాని కలిగించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
పెరుగుతో అల్సర్లు
పాలే కాదు.. రొయ్యలు తిన్న వెంటనే పెరుగు కూడా తీసుకోవద్దు. పెరుగుతో కలిపి కూడా తినొద్దు. అలా చేస్తే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొందరైతే రొయ్యల బిర్యానీలో పెరుగు కలుపుకుని తింటారు. ఇది మంచి అలవాటు కాదు. అజీర్తి సమస్యలు, అల్సర్లు వచ్చే ప్రమాదం ఉంది.
పిండి పదార్థాలతో కలపొద్దు
రొయ్యలు, పిండి పదార్థాలు ఆరోగ్యానికి హాని చేసే కాంబినేషన్. బ్రెడ్, పాస్తా లేదా వైట్ రైస్ వంటి స్టార్చ్ అధికంగా ఉండే ఆహారాలు రొయ్యలతో కలిపి తింటే అనారోగ్యాలు ఖాయం. రొయ్యలతో పాటు ఎక్కువ స్టార్చ్ తీసుకోవడం వల్ల కడుపులో అసౌకర్యం కలుగుతుంది. జీర్ణ సమస్యలు, ఉబ్బరం, కడుపులో చికాకు వంటి సమస్యలు కలుగుతాయి.
పులుపుకు దూరం
రొయ్యలతో పాటు పులుపు పదార్థాలు తీసుకోవద్దు. నిమ్మ, నారింజలాంటి వాటితో కాంబినేషన్ అస్సలు మంచిది కాదు. సిట్రస్ ఫ్రూట్స్, జ్యూసులు తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సిట్రస్ ఫ్రూట్స్‌లో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. రొయ్యల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఈ రెండూ కలిపి చర్య జరిపే అవకాశం ఉంది. దీంతో కడుపు సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదముందని నిపుణులు అంటున్నారు.