kitchen sink drain
ప్రతి ఒక్కరి ఇంట్లో సింక్ ఉండటం చాలా కామన్. అయితే.. మనం వాడుతున్న కొద్దీ అవి షైన్ కోల్పోతాయి. కొన్ని రకాల మరకలు కూడా పడతాయి. చివరకు పాతవాటిలా కనిపిస్తూ ఉంటాయి. అలా కాకుండా.. ఆ సింక్ కొన్నప్పుడు ఎలా ఉన్నాయో.. అలా మెరుస్తూ కనిపించాలని అనుకుంటున్నారా? అయితే, దాని కోసం మార్కెట్లో దొరికే ఖరీదైన లిక్విడ్స్ వాడాల్సిన అవసరం లేదు. కెమికల్స్ లేకుండా..మీ కిచెన్ లో దొరికే ఒకే ఒక వస్తువు వాడితే చాలు. మరి, అదేంటి? వాటిని ఎలా వాడితే సింక్ కొత్త వాటిలా మెరుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
kitchen sink
ప్రతి ఒక్కరి ఇంట్లో శెనగపిండి కచ్చితంగా ఉంటుంది. శెనగపిండితో మనం పకోడీలు, బజ్జీలు వేసుకుంటూ ఉంటాం. ఇదే శెనగపిండితో మనం మన సింకులను శుభ్రం చేయడానికి వాడొచ్చు అనే విషయం చాలా మందికి తెలీదు. దీనిని మనం ఎలాంటి భయం లేకుండా వాడొచ్చు. దీనిలో ఎలాంటి కెమికల్స్ ఉండవు. ఇది వాస్తవానికి ధూళి, గ్రీజు ,మరకలను తొలగించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. దీనితో పాటు, ఇది సింక్ నుండి తరచుగా వచ్చే వాసనను కూడా తొలగిస్తుంది.
శనగ పిండి మరీ స్మూత్ పౌడర్ లా ఏమీ ఉండదు. కాబట్టి.. దీనిని మనం సింక్ క్లీన్ చేయడానికి స్క్రబ్బర్ గా వాడొచ్చు. దీనితో స్క్రైబ్ చేయడం వల్ల అందులోని మురికి, ధూళి మొత్తం తొలగిపోతుంది. సింకు లో పేరుకుపోయిన టూత్ పేస్ట్, సబ్బు, జిడ్డుగా ఉండే నూనె, గ్రీజు మరకలను చాలా ఈజీగా తొలగించడంలో శెనగపిండి బాగా హెల్ప్ చేస్తుంది.
శనగ పిండి వాసనలను కూడా గ్రహిస్తుంది, ఇది సింక్ నుండి తేలికపాటి వాసనలను కూడా తొలగించడంలో సహాయపడుతుంది.శనగ పిండిని నిమ్మకాయ లేదా వెనిగర్‌తో కలిపితే, అది బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడుతుంది.
toilet
శనగ పిండి, నిమ్మకాయ..
శనగ పిండి,నిమ్మకాయను కలిపి బాత్రూమ్ సింక్‌ను శుభ్రం చేయడమే కాకుండా, దుర్వాసనను తొలగించి సింక్‌కు మెరుపును జోడిస్తుంది.2 టీస్పూన్ల గ్రాము పిండి లో సగం నిమ్మకాయ రసం కలిపి మంచి పేస్టులాగా చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సింక్‌కు అప్లై చేసి 5-10 నిమిషాలు అలాగే ఉంచండి.తేలికగా స్క్రబ్ చేసి, తర్వాత శుభ్రం చేసుకోండి.
kitchen sink
శెనగపిండి, వెనిగర్..
శెనగపిండి, వెనిగర్ కలిపి సింక్ ని శుభ్రం చేస్తే మొండి మరకలు తొలగించడానికి సహాయపడుతుంది.
2 టీస్పూన్ల శెనగపిండి లో 1 టీస్పూన్ వైట్ వెనిగర్ కలిపి ఉంచుకోవాలి. దీనిని మీరు సింక్ లో మరకల ప్రదేశంలో లేదా డ్రెయిన్ దగ్గర అప్లై చేయవచ్చు.10 నిమిషాల తర్వాత స్క్రబ్ చేసి కడగాలి.అంతే కొత్తవాటిలా మెరుస్తూ కనపడతాయి. అయితే.. పాలరాతి సింక్ లకు ఇలా వెనిగర్ వాడటం మంచిది కాదు.