AP DSC Crucial Tips: డీఎస్సీకి దరఖాస్తు చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తే.. ఉద్యోగం రాదు!

Published : Apr 21, 2025, 12:38 PM IST
AP DSC Crucial Tips: డీఎస్సీకి దరఖాస్తు చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తే.. ఉద్యోగం రాదు!

సారాంశం

AP DSC Crucial Tips: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఏప్రిల్‌ 20వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఈ  ప్రక్రియ మే15వ తేద వరకు కొనసాగుతుంది. ప్రస్తుతం అందరూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు చేసే తప్పులు.. పెద్దపెద్ద ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి. ఒక్కోసారి మంచి మార్కులు వచ్చినా ఉద్యోగం కూడా రాకపోయే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఏపీ విద్యాశాఖ ఎలాంటి జాగ్రత్తలు చెబుతుందో ఇప్పుడు చూద్దాం..   

డీఎస్సీ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వారి వివరాలు జాగ్రత్తగా నమోదు చేయాలని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఆన్‌లైన్‌ అప్లకేషన్‌లో ఒక్కసారి వివరాలు తప్పుగా నమోదు చేస్తే ఇక సరిచేయడం కుదరదని అంటున్నారు. కాబట్టి.. అభ్యర్థి పేరు, చదువు, ఇతర అర్హతలు, వివరాలు నమోదు చేస్తున్నప్పుడు ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని చెబుతున్నారు అధికారులు. ఒక్కసారి తప్పుగా నమోదు చేస్తే దాన్ని ఇక సరిచేయడం కుదరదని అంటున్నారు.  
 

ఇక ఈ ఏడాది నూతనంగా సర్టిపికేట్లను ఆన్‌లైన్‌ దరఖాస్తుతోనే అప్లోడ్‌ చేయాలని అధికారులు సూచించారు. అప్లికేషన్‌ పూర్తి చేసిన తర్వాత చివరిలో సర్టిఫికేట్లను కచ్చితంగా అప్లోడ్‌ చేయాలి. గతంలో ఉద్యోగానికి ఎంపికైన తర్వాత మాత్రమే సర్టిఫికేట్లను తీసుకురావాలని కోరేవారు. దీనివల్ల పలు లీగల్‌ సమస్యలు ఎదురయ్యేవి. ఉద్యోగ నియామకప్రక్రియ ఆలస్యం అయ్యేది. అయితే.. డీఎస్సీ పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని ఆలోచనలో అధికారులు ఉన్న నేపథ్యంలో ముందుకుగానే సర్టిఫికేట్లను అప్లోడ్‌ చేయాలని సూచిస్తున్నారు. 

సర్టిఫికేట్ల అప్లోడ్‌తోపాటు.. మీరు ఏ ఉద్యోగంలో చేరాలనుకుంటున్నారో ఆ పోస్టులకు ఆప్షన్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు స్కూల్‌ అసిస్టెంట్‌కు దరఖాస్తు చేసుకుంటే.. మున్సిపల్‌ స్కూల్‌, జిల్లా పరిషత్‌ హైస్కూల్‌, లేదా స్టేట్‌ లెవల్‌ స్కూల్స్‌... ఇలా మూడింటిలో మీకు నచ్చిన ప్రాధాన్యం క్రమంలో ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. మీకు తుది పరీక్షలో మెరిట్‌ మార్కులు వస్తే మూడింటిలో నచ్చినదానికి వెళ్లవచ్చు. అలా కాకుండా పరీక్ష క్యాలిపై అయితే.. ఆ మార్కులు, కేటగిరీ, రిజర్వేషన్‌ తదితరాల ఆధారంగా పోస్టును కేటాయించనున్నారు. కాబట్టి ఆప్షన్లు ఇచ్చే ముందే ఒకటికి రెండు ఆలోచించుకుని ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. 


ఆన్‌లైన్‌లో ఏవిధంగా దరఖాస్తు చేసుకోవలి అన్నది ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఆయన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్టు చేశారు. దీంతోపాటు అదేవిడియోను విద్యాశాఖ వెబ్‌సైట్‌లో కూడా పొందుపరిచారు. ఆ వీడియోలో తెలిపిన ప్రకారం.. అభ్యర్థి వివరాలు పూర్తిగా నమోదు చేసిన తర్వాతే ఫీజు చెల్లింపులు ఉంటాయని పేర్కొన్నారు. అయితే... గతంలో అనగా.. వైసీపీ హయాంలో డీఎస్సీ పరీక్షకు ఫీజు చెల్లించిన వారు ఇప్పుడు మరోసారి చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. పూర్తి వివరాలకు 
📥 Application Portals:
👉 https://cse.ap.gov.in
👉 https://apdsc.apcfss.in

ఏపీ విద్యాశాఖ వెబ్‌సైట్స్‌ను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Fog Alert : అధికపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో ఫాగ్ సైక్లోన్ కొనసాగుతోందా..? ఈ 12 జిల్లాలకు హైఅలర్ట్
IAS Amrapali Kata Speech: విశాఖ ఉత్సవ్ లో ఆమ్రపాలి పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu