JD Vance పిల్లలు ఇండియన్స్ అనిపించుకున్నారు

అమెరికా వైస్ ప్రెసిడెంట్ జె.డి. వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్, వాళ్ళ ముగ్గురు పిల్లలు సోమవారం ఉదయం భారతదేశంలో అడుగుపెట్టారు. పిల్లలు ముగ్గురూ భారతీయ దుస్తుల్లో కనిపించారు.

US Vice President JD Vance's Children Charm India in Traditional Attire

న్యూ ఢిల్లీ,  (ANI): అమెరికా వైస్ ప్రెసిడెంట్ జె.డి. వాన్స్ సోమవారం ఉదయం తన భార్య ఉషా వాన్స్ తో కలిసి భారతదేశంలో అడుగుపెట్టారు. వాళ్ళ ముగ్గురు పిల్లలు భారతీయ దుస్తుల్లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు.
అబ్బాయిలు  ఇవాన్, వివేక్ కుర్తా పైజామా ధరించగా, చిన్నారి మారిబెల్ అనార్కలి దుస్తుల్లో కనిపించింది.
వాన్స్ ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో దిగారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వారికి స్వాగతం పలికారు.
ఏప్రిల్ 21 నుండి 24 వరకు జరిగే ఈ పర్యటనలో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక, ఆర్థిక, రక్షణ సంబంధాలు మరింత బలపడతాయని భావిస్తున్నారు.
అధికారికంగా పర్యటన ప్రారంభమైన సందర్భంగా వారికి గౌరవ వందనం సమర్పించారు.
US Vice President JD Vance's Children Charm India in Traditional Attire
వైస్ ప్రెసిడెంట్ నేవీ బ్లూ సూట్, ఎర్రటి టై ధరించగా, ఉషా వాన్స్ ఎర్రటి డ్రెస్, తెల్లటి కోటులో కనిపించారు. అయితే, పిల్లలే అసలైన ఆకర్షణ!
ఇవాన్, వివేక్ నీలం, పసుపు రంగు కుర్తా పైజామాలో, మారిబెల్ నీలిరంగు అనార్కలిలో కనిపించారు.

విమానం దిగుతుండగా, జె.డి. వాన్స్ తన కూతుర్ని ఎత్తుకున్నారు.


పాలం విమానాశ్రయం చుట్టూ వైస్ ప్రెసిడెంట్ వాన్స్ కి స్వాగతం పలుకుతూ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు.
ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కూడా ఉంది.
ఢిల్లీలో అధికారిక సమావేశాల తర్వాత, వాన్స్ కుటుంబం ఏప్రిల్ 22న జైపూర్, ఏప్రిల్ 23న ఆగ్రా పర్యటిస్తారు.
తాజ్ మహల్ వద్ద ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఉషా వాన్స్ స్వగ్రామమైన ఆంధ్రప్రదేశ్‌లోని వడ్లూరు గ్రామంలో కూడా ఉత్సాహం నెలకొంది.
ఈ పర్యటన ఏప్రిల్ 24న ముగుస్తుంది. (ANI)

vuukle one pixel image
click me!