GHMC Results 2020: ఇప్పటికైనా ఈ అంశాలను టిఆర్ఎస్ పట్టించుకోకపోతే పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకం

Dec 5, 2020, 3:22 PM IST

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చబోతున్నాయా అంటే... సమాధానం అవుననే వచ్చేలా కనబడుతుంది. గ్రేటర్ ఎన్నికల్లో 100 సీట్లను గెలుస్తామని చెప్పిన తెరాస కనీసం 60  సీట్ల మార్కును కూడా అందుకోలేకపోయింది. గత దఫా ఎన్నికల్లో 99 సీట్లను గెలిచి బల్దియాలో గులాబీ జెండాను రెపరెపలాడించిన తెరాస ఈసారి మాత్రం ఖంగు తిని 55 సీట్లతో సర్దిపెట్టుకుంది.