Jul 19, 2021, 1:48 PM IST
అధికార అండతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు తాను చేపట్టిన ప్రజా దీవెన యాత్రకు ఆటంకాలు కల్పిస్తున్నారని మాజీ మంత్రి, బిజెపి నాయకులు ఈటల రాజేందర్ ఆరోపించారు. తాను పాదయాత్ర చేపట్టనున్నట్లు పది రోజుల క్రితమే ప్రకటించాను కాబట్టి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానిదేనని అన్నారు. కానీ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఈటల ఆందోళన వ్యక్తం చేశారు.