Jul 13, 2020, 2:28 PM IST
అనంత పద్మనాభస్వామి ఆలయం మేనేజ్‌మెంట్ వివాదంలో ట్రావెన్‌కోర్ రాజకుటుంబానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. ఈ తీర్పును చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్ స్వాగతించారు. పద్మనాభుడి ఆలయంలో ప్రభుత్వ జోక్యం పెరగడంతో చిలుకూరు మాజీ అర్చకుడు సౌందరరాజన్ 2011లో సుప్రీంలో ఇంటర్ వీనర్ పిటీషన్ వేశారని రంగరాజన్ అన్నారు.