G20 The India Story: జీ 20 సారథ్యంతో ప్రపంచ యవనికపై 140 కోట్ల భారతీయులు

Sep 6, 2023, 7:43 PM IST

ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ తెస్తున్న స్పెషల్ సిరీస్ ‘జీ 20 ది ఇండియా స్టోరీ’ ఢిల్లీలో ఈ నెల 9వ, 10వ తేదీల్లో జరగనున్న జీ 20 సదస్సుకు జరుగుతున్న సన్నాహాకలపై ఫోకస్ చేస్తుంది. 1983 అలీనోద్యమం తర్వాత భారత ఇలాంటి కూటములకు అధ్యక్షత వహించేదు. అందుకే జీ 20 గ్రూపునకు భారత్ అధ్యక్షత వహించడం కీలకంగా మారింది. ఈ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్‌లో భారత మాజీ అంబాసిడర్ టీపీ శ్రీనివాసన్, మాజీ అంబాసిడర్ సుజన్ చినోయ్‌లు జీ 20 సదస్సు గురించి లోతుగా చర్చిస్తారు.ప్రధాని మోడీ గొప్ప పట్టుదలతో జీ 20 సదస్సుకు అధ్యక్షత వహించే బాధ్యత భుజానికెత్తుకున్నారు. ఈ బాధ్యత ద్వారా దక్షిణ దేశాల అజెండాను ప్రపంచ దేశాల ముందుకు సగర్వంగా ఉంచడానికి వీలుచిక్కింది.ఐరాస భద్రతా మండలిని జీ20 గ్రూప్‌ కంటే భిన్నంగా చూస్తుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రపంచవ్యాప్తంగా శాంతి, భద్రతాపరమైన అంశాలను పర్యవేక్షిస్తుందని, జీ 20 ప్రధానంగా అంతర్జాతీయ ఆర్థిక అభివృద్ధి, స్థూల ఆర్థిక సుస్థిరతపై ఫోకస్ పెడుతుందని భారత్ భావిస్తున్నది. అమెరికా, చైనాల మధ్య ఘర్షణాత్మక సంబంధాలు  ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుండగా.. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, కోవిడ్ మహమ్మారి విలయం వంటివి మరింత నష్టం చేకూర్చాయి. ఇలాంటి పరిస్థితిలో జీ 20 సదస్సుకు ప్రాధాన్యత గణనీయంగా పెరిగింది. సరైన సమయంలో రుణ సంక్షోభం, అధిక వడ్డీరేట్లు, ఆహార సంక్షోభం, చమురు, ఆర్థికం, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఫర్టిలైజర్లు వంటి ముఖ్యమైన అంశాలను చర్చకు పెట్టడంలో భారత్ సఫలమైంది.జీ 20 అధ్యక్షత వహించడంలో మొత్తం దేశమంతా భాగస్వామ్యం ప్రథమం అని చినోయ్ అన్నారు. ఈ వేదిక ద్వారా 140 కోట్ల భారతీయులు బయటి ప్రపంచానికి పరిచయం అయ్యారు. దేశంలోని పలు ప్రాంతాల్లో సుమారు 200 కార్యక్రమాలను నిర్వమించి చాలా మంది భారతీయులను పరిచయం చేయగలిగామని వివరించారు.