IPL 2025: ఐపీఎల్‌ ప్రసారం చేసినందుకు ముఖేష్ అంబానీకి అన్ని వేల కోట్ల ఆదాయమా?

Published : Mar 13, 2025, 08:46 PM IST

IPL 2025: ప్రపంచ కుబేరుల్లో ఒకరు, భారత దేశంలోనే అత్యంత ధనవంతుడు అయిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రసారం చేసే అంబానీ జియో హాట్‌స్టార్ నెట్‌వర్క్ ద్వార ఎంత ఆదాయం సంపాదిస్తారో తెలుసా? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం రండి.

PREV
14
IPL 2025: ఐపీఎల్‌ ప్రసారం చేసినందుకు ముఖేష్ అంబానీకి అన్ని వేల కోట్ల ఆదాయమా?

ప్రపంచ దిగ్గజ కంపెనీ రిలయన్స్ సంస్థ వ్యాపారం చేయని రంగం లేదు. ప్రతి ఇంటికి అవసరమైన అన్ని వస్తువులను ఈ సంస్థ విక్రయిస్తుంది. కిరాణా వస్తువుల నుంచి బట్టలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, టెలికాం సేవలు, పెట్రోల్ బంకులు, ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రికల్ స్కూటర్లు ఇలా అన్ని రకాల వస్తువులు విక్రయిస్తూ దేశంలోనే నంబర్ వన్ కంపెనీగా ఎదిగింది. 

 

24

అలాంటి రిలయన్స్ హాట్ స్టార్ నెట్వర్క్ తో కలిసి జియో హాట్ స్టార్ గా మారింది. జియో హాట్ స్టార్ ద్వారా వివిధ భాషల సినిమాలు, వెబ్ సిరీస్ రిలీజ్ చేస్తూ వినోద రంగంలోనూ సత్తా చాటుతోంది. అంతేకాకుండా సినిమాలను ప్రమోట్ చేయడం, సినిమాలకు ఫైనాన్స్ చేయడం ద్వారా కూడా లాభసాటి ఆదాయం పొందుతోంది. జియో హాట్ స్టార్ ఇప్పుడు ఇండియాలో ఎక్కువ మంది సబ్ స్క్రిప్షన్ తీసుకున్న వాటిల్లో ఒకటి. 

34

ఈ జియో హాట్ స్టార్ ఐపీఎల్ మ్యాచ్ లను ప్రసారం చేస్తూ కూడా మంచి ఆదాయాన్ని పొందుతోంది. ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్ లు మార్చి 22 నుంచి మొదలయ్యాయి. వీటిని లైవ్ ప్రసారం చేస్తూ జియో హాట్ స్టార్ రూ.కోట్లు సంపాదిస్తోంది. ఈ ఐపీఎల్ మ్యాచ్ లు మే 25 వరకు జరుగుతాయి. మే 25న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ప్రపంచంలోనే రిచెస్ట్ క్రీడ అయిన ఐపీఎల్ ద్వారా ఒక్క జియో హాట్‌స్టార్ మాత్రమే కాకుండా బీసీసీఐ, ఐపీఎల్ టీమ్స్ రూ.కోట్లు సంపాదిస్తున్నాయి. 

44

ఐపీఎల్ నుంచి జియో ఆదాయం ఎంత?

ఐపీఎల్ 2025 మొత్తం మీద రూ.6,000 కోట్ల నుంచి రూ.7,000 కోట్ల వరకు వస్తుందని అంచనా. ఇందులో జియో హాట్ స్టార్ కే రూ.4,500 కోట్లు వస్తుందని సమాచారం. 10 ఐపీఎల్ టీమ్స్ స్పాన్సర్‌షిప్ ద్వారా రూ.1,300 కోట్లు సంపాదిస్తాయని అంచనా. ఈ ఐపీఎల్ కి ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్న టీమ్స్ లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ టాప్‌లో ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories