3 సినిమాలు, 3300 కోట్లు, బ్లాక్ బస్టర్ సినిమాల లక్కీ హీరోయిన్ ఎవరో తెలుసా?


Pan India Lucky Heroine: హీరో అయినా హీరోయిన్ అయినా మంచి అవకాశాలు రావాలంటే వాళ్ల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబట్టాలి.  ఎంత మంచి నటులైనా సినిమాలు ఆడకపోతే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఐతే, ఇప్పుడు ఇండియన్ సినిమాలో ఓ హీరోయిన్ మాత్రం అడుగు పెడితే కోట్లు కురిపిస్తోంది. పాన్ ఇండియా సినిమాలకు అదృష్టదేవతగా మారిపోయింది. ఇంతకీ ఎవరా బ్యూటీ? 
 

Rashmika Mandanna Recent Movies Rake in 33 Billion Rupees Worldwide in telugu jms

Pan India Lucky Heroine:  స్టార్ హీరోలకు ఆమె  లక్కీ హీరోయన్ గా మారింది. తెలుగు సినిమాల వల్ల స్టార్ డమ్ సాధించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం పాన్ ఇండియాను శాసిస్తోంది. తెలుగులో చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. అటు బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటోంది. అక్కడ కూడా వందల కోట్ల హీరోయిన్ గా అవతారం ఎత్తింది. ఇంతకీ ఎవరా హీరోయిన్? 

Also Read: రీ ఎంట్రీ ఇవ్వబోతున్న చిరంజీవి హీరోయిన్, ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్

Rashmika Mandanna Recent Movies Rake in 33 Billion Rupees Worldwide in telugu jms
Rashmika Mandanna’

ఆమె ఎవరో కాదు, రష్మిక మందన్న. నక్క తోక తొక్కి వచ్చినట్టుంది. ఎన్నో ఏళ్లు కష్టపడితే కాని రాని స్టార్ డమ్ రష్మికకు చాలాత్వరగా వచ్చింది. హీరోయిన్లు అందరు  కలలు కనే  లైఫ్ రష్మికకు  సొంతం అయ్యింది.  రష్మిక హీరోయిన్ గా చేసిన లాస్ట్ మూడు సినిమాలు కలిపి ఏకంగా 3300 కోట్లు కొల్లగొట్టాయి. అవును, చాలా మంది హీరోలు కూడా అందుకోలేని రేంజ్ ఇమేజ్ తో  ఆమె దూసుకుపోతోంది.

Also Read: 14 ఏళ్ళకే ఫస్ట్ కిస్, నాగచైతన్య ముద్దు పెట్టిన అమ్మాయి ఎవరు?


రష్మిక నటించిన రెండు హిందీ సినిమాలు, ఒక పాన్ ఇండియన్ తెలుగు సినిమా బాగా ఆడాయి. హిందీలో 'యానిమల్', 'ఛావా', తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చిన బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా మూవీ  'పుష్ప 2' సినిమా కూడా నార్త్ ఇండియాలో దుమ్మురేపాయి. ఈ మూడు సినిమాలు కలిపి దాదాపు 3000 కోట్లకుపైగా వసూళ్లు సాధించాయి.  దీంతో ఇటు సౌత్ లోనే కాకుండా  బాలీవుడ్ లో ఎక్కువ కలెక్షన్లు సాధించిన హీరోయిన్ గా రష్మిక నిలిచింది.

Also Read: వింత వ్యాధి తో బాధపడుతున్న స్నేహ, ఆమె భర్త ప్రసన్న బయటపెట్టిన అసలు రహస్యం?

Rashmika Mandanna

వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక ముందు ముందు మరిన్ని మంచి ప్రాజెక్టులతో రానుంది. సల్మాన్ ఖాన్ హీరోగా వస్తున్న 'సికందర్', మడ్డోక్ హారర్ కామెడీ 'తమ', పాన్ ఇండియన్ యాక్షన్ మూవీ 'కుబేర'  సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. భారీగా రెమ్యునరేషన్ కూడా వసూలు చేస్తోందట బ్యూటీ.  

Also Read: మోహన్ బాబు దెబ్బకు డిజాస్టర్ అయిన చిరంజీవి సినిమా

Latest Videos

click me!