Train Ticket Profit: ఒక్కో ట్రైన్ టికెట్ పై రైల్వే శాఖకు ఎంత లాభం వస్తుందో తెలుసా?

Published : Mar 13, 2025, 07:49 PM IST

Train Ticket Profit: ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ లలో నాలుగోది భారతీయ రైల్వే శాఖ. దేశ వ్యాప్తంగా రోజూ వేల ట్రైన్స్ తిరుగుతుంటాయి. ప్రయాణికుల టికెట్లు, సరకు రవాణా ద్వారా రోజూ కోట్ల రూపాయలు రైల్వే ఖజానాకు చేరుతున్నాయి. ఒక టికెట్‌పై రైల్వే ఎంత లాభం పొందుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
14
Train Ticket Profit: ఒక్కో ట్రైన్ టికెట్ పై రైల్వే శాఖకు ఎంత లాభం వస్తుందో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ అయిన భారతీయ రైల్వే ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తుంది. ఈ విధంగా కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తుంది. ప్రతిరోజూ దాదాపు 25 మిలియన్ల మంది ప్రయాణికులు ఇండియన్ రైల్వే ద్వారా ప్రయాణిస్తున్నారు. ఇది రైల్వేకు గణనీయమైన ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ఇది కాకుండా సరుకు రవాణా ద్వారా రైల్వేకు ఎక్కువ ఆదాయం వస్తుంది. 

24

ఒక రోజులో రైల్వే ఎంత సంపాదిస్తుంది?

2021-22లో విడుదలైన వాణిజ్య మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం, భారతీయ రైల్వే రోజుకు 400 కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తుంది. ఇందులో ఎక్కువ భాగం టిక్కెట్లు, సరుకు రవాణా ద్వారా వస్తుంది. ఇలా వచ్చిన ఆదాయంతో రైళ్లే వ్యవస్థను సక్రమంగా నడుపుతారు. టికెట్లు, సరకు రవాణా ద్వారా వచ్చిన ఆదాయంతోనే రైళ్లకు ఇంధనం, సిబ్బంది జీతాలు, నిర్వహణ, మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. 

34

ఒక్కో టికెట్‌పై రైల్వేకు ఎంత ఆదాయం వస్తుంది

ప్రయాణీకులకు రైలులో సర్వీస్, మౌలిక సదుపాయాలు, నిర్వహణ, భద్రత కల్పించినందుకు గాను రైల్వే శాఖ ప్రయాణికుల నుంచి ఛార్జ్ వసూలు చేస్తుంది. టికెట్ నుండి వచ్చే ఆదాయం రైలు రకం, దూరం, ప్రయాణీకుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది.

రైల్వే లెక్కల ప్రకారం సాధారణ మెయిల్ లేదా ఎక్స్‌ప్రెస్ రైలు నుండి ఒక టికెట్‌కు రూ. 40-50 రైల్వే శాఖ సంపాదిస్తుంది. రాజధాని, శతాబ్ది, వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లు టికెట్‌కు రూ.100-500 మిగులుతుంది. 

44

టికెట్ క్యాన్సిలేషన్ ద్వారా ఎంత ఆదాయం

RAC రద్దు చేస్తే రైల్వే శాఖకు రూ. 60 ఆదాయం వస్తుంది. ట్రైన్ బయలుదేరడానికి 48 గంటల ముందు కన్ఫర్మ్ అయిన టిక్కెట్లను రద్దు చేస్తే ఫస్ట్ ACకి రూ. 240, 2వ ACకి రూ. 200, థర్డ్ ACకి రూ.180 ప్రయాణికుల నుంచి కట్ చేస్తారు. ఈ డబ్బులన్నీ రైల్వే శాఖ ఖనాజాకు చేరతాయి. 

click me!

Recommended Stories