Rohit Sharma
Rohit Sharma's Big Plan: ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ లో హాట్ టాపిక్ అవుతున్న పేర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. గత కొంత కాలంగా ఈ స్టార్ సీనియర్ ప్లేయర్లు అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. మరీ ముఖ్యంగా పాకిస్తాన్, దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముగిసిన తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ తీసుకుంటారనే పుకార్లు వ్యాపించాయి.
అయితే, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్ ను గెలిచిన తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ పుకార్లపై స్పందించారు. తాను ఇప్పుడే క్రికెట్ కు వీడ్కోలు చెప్పడం లేదని స్పష్టం చేశాడు. ఇప్పటికే టీ20 క్రికెట్ కు గుడ్ బై చెప్పిన రోహిత్ శర్మ.. ప్రస్తుతం వన్డే, టెస్టు క్రికెట్ ఆడుతున్నాడు.
Rohit Sharma. (Photo- BCCI X@BCCI)
రోహిత్ శర్మ వన్డే క్రికెట్ రిటైర్మెంట్ ఎప్పుడంటే?
తన రిటైర్మెంట్ పుకార్లపై రోహిత్ శర్మ స్పందిస్తూ.. "నేను వన్డే ఫార్మాట్ నుండి రిటైర్ కావడం లేదు. నా రిటైర్మెంట్ వార్తలు కేవలం పుకార్లు మాత్రమే. అందులో నిజం లేదు. భవిష్యత్ ప్లానంటూ ఏమీ లేదు.. మున్ముందు ఏది జరిగితే అది జరగుతుందని" కామెంట్స్ చేశాడు. దీంతో హిట్ మ్యాన్ రిటైర్మెంట్ పుకార్లు చల్లబడ్డాయి. కానీ, తాజాగా మరో బిగ్ అప్ డేట్ వచ్చింది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలుచుకున్న తర్వాత రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ పై మరో బిగ్ ప్లాన్ చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే రోహిత్ శర్మను మరో ఐసీసీ ఈవెంట్ లో కూడా చూడవచ్చు. ప్రస్తుతం రిటైర్మెంట్ ఆలోచన లేదనీ, ఆటను బాగా ఆడటంపై దృష్టి ఉందని చెప్పాడు. అలాగే, 2027 ప్రపంచ కప్‌లో తాను ఆడటం లేదా ఆడకపోవడంపై ఎలాంటి పక్కా ప్రణాళికలు లేవు కానీ ప్రస్తుతం ఆటను కొనసాగిస్తానని చెప్పాడు.
India captain Rohit Sharma (Photo: X@ICC)
అయితే, 2027 వన్డే ప్రపంచ కప్ ఆడటానికి రోహిత్ నిర్ణయం తీసుకున్నాడని క్రిక్‌బజ్ నివేదికలు పేర్కొంటున్నాయి. తన ప్లాన్ ప్రకారం అనుకున్న అన్ని విషయాలు జరిగితే 2027లో జరిగే వన్డే ప్రపంచ కప్ ఆడిన తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటారని సంబంధిత నివేదికలు పేర్కొంటున్నాయి. రెండు నెలల్లో రోహిత్ వయసు 38 సంవత్సరాలు అవుతుంది. రాబోయే ప్రపంచ కప్ ప్రారంభం నాటికి అతనికి 40 సంవత్సరాలు వస్తాయి. ఫిట్‌నెస్, బ్యాటింగ్ అప్రోచ్ కోసం అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌తో కలిసి రోహిత్ శర్మ తన ప్లాన్ ను కొనసాగించనున్నాడని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
Rohit Sharma
2027 ఐసీసీ ఈవెంట్ వరకు భారత జట్టు వన్డే ఫార్మాట్‌లో 27 మ్యాచ్ లను ఆడుతుందని భావిస్తున్నారు. తరువాత మరిన్ని మ్యాచ్‌లను జాబితాలో చేర్చవచ్చు. మెగా టోర్నమెంట్‌కు సిద్ధం కావడానికి రోహిత్ వీటిలో పాల్గొనే అవకాశం ఉంది. భారత క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ రోహిత్ శర్మను ప్రపంచ కప్‌కు సిద్ధం చేయడంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.