Feb 18, 2020, 1:28 PM IST
ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం రూ .43 లక్షల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. మొహమ్మద్ అర్షి అనే వ్యక్తినుండి కేంద్ర పారిశ్రామిక భద్రతా(సిఐఎస్ఎఫ్) సిబ్బంది ఈ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. విదేశీ కరెన్సీని పెర్ఫ్యూమ్
డబ్బాలు, క్లాత్ పర్సుల్లో దాచి తీసుకువెడుతుండగా పట్టుకున్నారు. అతన్ని కస్టమ్స్ విభాగానికి అప్పగించారు.