Jun 6, 2020, 1:22 PM IST
లాక్ డౌన్ సమయంలో అవాంఛిత గర్భాలు ఎక్కువగా నమోదవుతున్నాయని, వీరిలో చాలామంది వద్దనుకున్నా గర్భం దాలుస్తున్నారని తాజాగా ఓ సర్వేలో తేలింది. దీనికి చెక్ పెట్టడానికి బిహార్ ప్రభుత్వం ఉచితంగా కండోమ్‌లను, గర్భ నిరోధక మాత్రలను పంపిణీ చేస్తోంది. క్వారంటైన్ సెంటర్లలో
ఉన్నవారికి, ఇళ్లకు చేరుకున్న వలస కూలీలకు కండోమ్‌లు పంపిణీ చేస్తున్నామని బిహార్ ఆరోగ్యశాఖకు చెందిన డాక్టర్ ఉత్పల్ దాస్ వెల్లడించారు. కేర్ ఇండియా సంస్థ సహకారంతో ఈ డ్రైవ్ చేపట్టామని వారు తెలిపారు.