Chaitanya Kiran | Published: Jan 31, 2023, 11:58 AM IST
చిక్కమంగళూరు : గొడ్డు మాంసం (బీఫ్) విక్రయిస్తున్నాడంటూ ఓ యువకున్ని బజరంగదళ్ కార్యకర్తలు చితకబాదిన ఘటన చిక్కమంగళూరు జిల్లాలో వెలుగుచూసింది. ముదిగెరె సమీపంలోని ముద్రెమనె ప్రాంతంలో రెహమాన్ అనే యువకుడు బైక్ పై వెళుతుండగా బజరంగ్ దళ్ కార్యకర్తలు నితిన్, అజిత్, మధు అడ్డుకున్నారు. అతడి వద్దనున్న బ్యాగ్ ను పరిశీలించగా అందులో మాంసం కనిపించగా అది గొడ్డుమాంసంగా అనుమానించి రెహమాన్ ను చితకబాదారు. ఓ కరెంట్ స్తంబానికి యువకున్ని కట్టేసి కొడుతూ చిత్రహింసలు పెట్టారు. అయితే ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని రెహమాన్ ను అదుపులోకి తీసుకుని అతడి వద్ద లభించిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.