హైదరాబాద్ వరదలు : సాయం కోసం కదిలిన సినీ, రాజకీయ, కార్పొరేట్ ప్రముఖులు...

Oct 20, 2020, 7:21 PM IST

ఎప్పుడూ కనీవినీ ఎరుగని వరదలతో హైదరాబాద్ చిగురుటాకులా వణికిపోతోంది. ఇప్పటికే సగానికి పైగా నగరం వరద గుప్పిట్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. దీనికి తోడు మళ్లీ వర్షసూచనలు.. అక్కడక్కడా పడుతున్న వర్షాలు.. మరో మూడు రోజులు అల్పపీడనం.. నగరజీవికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ముంపుప్రాంతాల్లో ప్రజలు బతికుండగానే నరకం చూస్తున్నారు.