టీమిండియా చెత్త రికార్డు - టెస్ట్ క్రికెట్ చరిత్రలో టాప్-10 అత్యల్ప మొత్తం స్కోర్లు ఇవే

First Published | Oct 17, 2024, 11:29 PM IST

top-10 lowest total scores in Test cricket : బెంగళూరు టెస్ట్‌లో భారత బ్యాటింగ్ లైనప్ ఘోరంగా విఫ‌ల‌మైంది. రిషబ్ పంత్, య‌శ‌స్వి జైస్వాల్ మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగ‌తా ఆట‌గాళ్లు అంద‌రూ సింగిల్ డిజిట్ కే ప‌రిమితం అయ్యారు. 46 ప‌రుగుల‌కే ఆలౌట్ అయి చెత్త రికార్డును న‌మోదుచేసింది భార‌త్. 
 

these are the top-10 lowest total scores in the history of Test cricket

top-10 lowest total scores in the history of Test cricket : బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు గురువారం భారత్ 46 పరుగులకే ఆలౌటైంది. భార‌త ఆట‌గాళ్లు ఎవ‌రూ పెద్ద ఇన్నింగ్స్ ను ఆడ‌లేక‌పోయారు. కేవ‌లం రిష‌బ్ పంత్, య‌శ‌స్వి జైస్వాల్ మాత్ర‌మే డ‌బుల్ డిజిట్ ప‌రుగులు చేశారు. మిగ‌వారంద‌రూ సింగిల్ డిజిట్ కే పెవిలియ‌న్ కు చేరారు. ఇది స్వదేశీ టెస్ట్‌లో వారి అత్యల్ప స్కోరును భార‌త్ న‌మోదుచేసింది. అలాగే, భారతదేశ టెస్ట్ చరిత్రలో మూడవ అత్యల్ప స్కోరుగా నిలిచింది. అయితే, టెస్టు క్రికెట్ హిస్ట‌రీలో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన టాప్-10 అత్యల్ప టెస్టు ప‌రుగుల మొత్తాలు ఇలా ఉన్నాయి. 

these are the top-10 lowest total scores in the history of Test cricket

10. ఆస్ట్రేలియా - 42 పరుగులు

1888 లో సిడ్నీలో జరిగిన ఒక మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 113 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా కేవలం 42 పరుగులకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్ లో 82 పరుగులు మాత్రమే చేసిన ఆస్ట్రేలియా చివరకు 126 పరుగుల తేడాతో ఓడిపోయింది.

9. న్యూజిలాండ్ - 42 పరుగులు

1946లో వెల్లింగ్టన్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 42 ప‌రుగుల‌కే న్యూజిలాండ్ ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా 199/8 వద్ద డిక్లేర్ చేయడంతో, న్యూజిలాండ్ తన రెండో ఇన్నింగ్స్‌లో 54 ప‌రుగుల‌కే మళ్లీ కుప్పకూలింది. దీంతో ఇన్నింగ్స్ - 103 పరుగుల తేడాతో ఓడిపోయింది.


these are the top-10 lowest total scores in the history of Test cricket

8. ఐర్లాండ్ - 38 పరుగులు

2019 లో లార్డ్స్‌లో ఇంగ్లాండ్ తో  జరిగిన చారిత్రాత్మక టెస్టులో ఐర్లాండ్ 182 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో కేవలం 38 పరుగులకే ఆలౌటైంది. అయితే, తొలి ఇన్నింగ్స్‌లో 207 పరుగులు చేసి ఇంగ్లాండ్‌ను 85 పరుగులకే ఆలౌట్ చేసింది.


7. భారత్ - 36 పరుగులు

2020 లో అడిలైడ్‌లో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్‌లో భారతదేశం మొదటి ఇన్నింగ్స్‌లో 53 పరుగుల ఆధిక్యంలో ఉన్న తర్వాత రెండవ ఇన్నింగ్స్‌లో తమ అత్యల్ప టెస్ట్ స్కోరు 36ను నమోదు చేసింది. స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల తేడాతో సులువుగా ఛేదించింది.

these are the top-10 lowest total scores in the history of Test cricket

6. ఆస్ట్రేలియా - 36 పరుగులు

1902 లో బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లండ్ 376/9 స్కోరును నిర్దేశించిన తర్వాత ఆస్ట్రేలియా కేవలం 36 పరుగులకే ఆలౌట్ అయింది. ఫాలో ఆన్ మ్యాచ్ టైగా ముగిసింది. 

5. దక్షిణాఫ్రికా - 36 పరుగులు

1932 లో మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 36 పరుగులకే కుప్ప‌కూలింది. 117 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని ఛేదించే క్ర‌మంలో తమ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 45 పరుగులకే ఆలౌట్ అయ్యారు. దీంతో ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ - 72 పరుగుల తేడాతో ఓడిపోయింది. 

these are the top-10 lowest total scores in the history of Test cricket

4. దక్షిణాఫ్రికా - 35 పరుగులు

1899 లో కేప్ టౌన్ లో ఇంగ్లాండ్ తో జ‌రిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 35 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్‌ను 92 పరుగులకే కట్టడి చేసింది. 246 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి 210 పరుగుల తేడాతో ఓడిపోయింది.

3. దక్షిణాఫ్రికా - 30 పరుగులు

1924 లో బర్మింగ్‌హామ్‌లో జరిగిన టెస్టులో ఇంగ్లండ్ చేసిన 438 పరుగులకు సమాధానంగా బ్యాటింగ్ మొద‌లుపెట్టిన దక్షిణాఫ్రికా కేవలం 30 పరుగులకే ఆలౌటైంది. ఫాలో-ఆన్ ప్రయత్నం తర్వాత వారు ఇన్నింగ్స్ - 18 పరుగుల తేడాతో ఓడిపోయారు.

these are the top-10 lowest total scores in the history of Test cricket

2. దక్షిణాఫ్రికా - 30 పరుగులు

1896 లో కాన్ బెర్రాలో దక్షిణాఫ్రికా మళ్లీ 319 పరుగుల ఛేదనలో కేవలం 30 పరుగుల స్కోరుతో ఓటమిని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో 288 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది.

1. న్యూజిలాండ్ - 26 పరుగులు

1955 లో ఆక్లాండ్‌లో కేవలం 26 పరుగులకే ఆలౌట్ అయిన న్యూజిలాండ్ టెస్టు చరిత్రలో అత్యల్ప స్కోరు నమోదు చేసి చెత్త రికార్డును త‌న పేరున లిఖించుకుంది. తొలి ఇన్నింగ్స్ తర్వాత 46 పరుగుల వెనుకంజలో ఉన్న వారు ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్-26 పరుగుల తేడాతో ఓడిపోయారు.

Latest Videos

click me!