vuukle one pixel image

తిరుపతిలో వైభవంగా శ్రీవారి మెట్లోత్సవం | TTD Updates | Lord Venkateswara | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Feb 12, 2025, 6:01 PM IST

దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో తిరుమల శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం వైభవంగా జరిగింది. తెల్లవారుజామున తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్య మెట్ల పూజ నిర్వహించి మెట్లోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా టీటీడీ బోర్డు సభ్యులు భానుప్ర‌కాష్ రెడ్డి మాట్లాడారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో శ్రీవారి మెట్లోత్సవం నిర్విగ్నంగా జరుగుతుందని తెలిపారు. శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ కార్యక్రమం భజన మండళ్ల సభ్యులకు మోక్షానికి అవసరమైన జ్ఞానాన్ని ప్రసాదించే మహత్తరమైన కార్యక్రమని చెప్పారు. మానవులు జ్ఞానపూర్వకంగా, శ్రద్ధతో, యోగ్యతానుసారంగా పనిచేయాలని, శ్రేయో మార్గమైన ఇలాంటి అంశాలను అలవరుచుకుంటే జీవనం సుఖమయం అవుతుందని వివ‌రించారు.