Sachin vs Kohli: సచిన్, కోహ్లీ ఇద్దరిలో అత్యుత్తమ క్రికెటర్‌ ఎవరో తెలుసా? ఇదొక్కటి చదవండి చాలు!

Sachin vs Kohli: 'సచిన్ రమేష్ టెండూల్కర్' ఈ పేరు తెలియని వారు, వినని వారు ఉండరు. నేటి తరానికి సచిన్‌ గురించి, అతని ఆట గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. 90వ దశకంలో పుట్టిన వారు, అంతకు ముందు పుట్టిన ప్రతి ఒక్కరూ క్రికెట్లో సచిన్‌ ఒక ట్రెండ్ సెట్టరని అంటారు. కొందరు గాడ్‌ ఆఫ్‌ క్రికెట్‌ అని ముద్దుగా పిలుస్తుంటారు. సచిన్‌ క్రికెట్‌ చూసి ఎంతోమంది ఆటగాళ్లు క్రికెట్‌పై ఆసక్తి చూపారు. అలాంటి వాళ్లలో విరాట్ కోహ్లీ కూడా ఒకరు. అయితే... కోహ్లీ బ్యాటింగ్‌ యావరేజ్ చూస్తే సచిన్‌ కంటే అధికంగా ఉంది. సచిన్‌కు 40 యావరేజ్‌ ఉంటే.. కోహ్లీకి 60  వరకు ఉంది. దీంతో సచిన్‌ కంటే కోహ్లీ గొప్ప ఆటగాడు అని కొందరు అంటుంటారు. అసలు సచిన్‌కి, కోహ్లీకి ఏమైనా పోలిక ఉందా? 

Sachin vs Kohli: Who Is the Real Legend of Indian Cricket? in telugu tbr
sachin kohli

సచిన్ ఆటను కొలిచేందుకు అతని గణాంకాలను కాదు చూడవలసినది. అతను ఆటను మొదలుపెట్టినప్పటి కాలంలోని పరిస్థితులు ఎలా వున్నాయి, ఇప్పుడు ఎలా మారిపోయాయి అన్నది ఒక్కసారి గమనిస్తే మీకే సమాధానం తెలిసిపోతుంది. సచిన్ 1989లో తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ని ప్రారంభించాడు. అప్పట్లో ఇప్పటిలా బ్యాట్స్‌మెన్ ఫేవర్ గా పరిస్థితులు ఉండేవి కాదు. వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్ వంటి అరివీర భయంకర బౌలింగ్ దాడిని ఎదుర్కొంటూ ఒక పదహారేళ్ళ కుర్రవాడు బ్యాటింగ్ చెయ్యడం ఆషామాషీ విషయం ఏమీ కాదు.

Sachin vs Kohli: Who Is the Real Legend of Indian Cricket? in telugu tbr
Sachin-Virat

అప్పట్లో హెల్మెట్ లు కూడా సరిగా ఉండేవి కాదు.. సచిన్‌ ఆడిన తొలి మ్యాచ్‌లోనే వకార్ వేసిన ఒక బౌన్సర్ బంతి అతని ముఖానికి బలంగా తగిలి ముక్కు పగిలి రక్తం చిందింది. ఐనా నొప్పిని పంటి బిగువున అదిమిపెడుతూ నిలబడి అర్ధ శతకం చేసి జట్టుని ఓటమి నుంచి కాపాడాడు. సచిన్ క్రికెట్ పుస్తకంలో ఉన్న అన్ని షాట్లనూ అవలీలగా ఆడగలడు. అలాగే స్ట్రీట్ క్రికెట్ షాట్లు ఆడటానికీ వెనుకాడడు. అతను ఆడే షాట్లలో ఎంతో కచ్చితత్వం వుంటుంది.


sachin kohli

ఒకానొక సందర్భంలో తన ట్రేడ్‌మార్క్ షాట్ అయిన కవర్ డ్రైవ్ వల్లనే తాను ఆ ఏడాది ఆసీస్ లో తరచుగా అవుట్ అవ్వడం జరుగుతోందని గమనించిన సచిన్, ఒక ఇన్నింగ్స్ ఆసాంతం ఆ షాట్ ని అస్సలు ఆడకుండా పూర్తి నియంత్రణతో 436 బంతులని కాచుకుంటూ ఆస్ట్రేలియా మేటి బౌలర్లపై తన ఆధిపత్యాన్ని చూపెడుతూ సిడ్నీ మైదానంలో అజేయంగా నిలిచి టెస్టుల్లో తన అత్యధిక స్కోరు 241* పరుగులు నమోదు చేసాడు. దాంతో, అతని బ్యాటింగ్ విన్యాసాలను ప్రత్యర్థులే ఎంతగానో మెచ్చుకున్నారు.

Sachin-Virat Kohli-

వన్డేలు మొదలైన తర్వాత పదిహేనేళ్ళ పాటు ఒక బ్యాట్సమెన్ తన కెరీర్ మొత్తంలో ఒకట్రెండు వన్డే సెంచరీలు చేస్తేనే గొప్పగా భావించేవాళ్ళు. అప్పట్లో ఇప్పుడు ఉన్నంతగా బ్యాట్స్‌మెన్ కి అనుకూలంగా ఫీల్డింగ్ పరిమితులు, పవర్ ప్లే వంటివి ఉండేవి కాదు. టెస్ట్ మ్యాచ్ లో ఆడినట్లే వన్డేలలో కూడా చాలామంది ఆటగాళ్ళు ఆడేవారు. అలాంటి సమయంలో సచిన్ మంచి నీళ్లు తాగినంత సులువుగా వన్డేలలో సెంచరీల వరద పారించాడు. ఇప్పటి తరం ఆటగాళ్ళందరికీ (కోహ్లీతో కలిపి) సచిన్ ఆట ఒక బెంచి మార్క్ లాంటిది.

sachin kohli

జూ.ఎన్డీఆర్‌ నటించిన జనతా గ్యారేజ్ సినిమాలో కూడా ఒక డైలాగ్ ఉంది. 'జట్టు బలహీనంగా ఉన్నప్పుడు సచిన్ క్రీజులో ఉన్నాడంటే ఒక ధైర్యం ఉండేది' అని. అందుకే, సచిన్ అవుటయితే టీవీలు కట్టేసిన సందర్భాలు కోకొల్లలు. ఒకసారి సచిన్ సెంచరీ చెయ్యడాన్ని చూడటం కోసం సిమ్లా నుంచి డిల్లీ వెళ్తున్న రైలుని కూడా ఒక హాల్ట్ దగ్గర కొంతసేపు ఆపడం జరిగింది. 

sachin kohli

తొంభైవ దశకంలో బ్యాటింగ్ చేసే జట్లు ఇప్పటిలా ప్రతి మ్యాచులో మూడొందలు పరుగులు కొట్టడం అనేది సాధ్యమయ్యేది కాదు. అన్నిచోట్లా బౌలింగ్ వికెట్లు ఎక్కువగా ఉండటం వల్ల, అప్పటికి టి20 ఇంకా రాకపోవడం వల్ల క్రీజులో నిలబడి బంతుల్ని కాచుకోవడానికే ఎక్కువగా ప్రాధాన్యత ఉండేది. అటువంటి సమయంలో సచిన్ తన వికెట్ కి 'వంద మార్కు' అనే విలువను ఏర్పరుచుకుని ఆడేవాడు. కేవలం బ్యాటింగ్ అనే కాక బౌలింగ్ లో, ఫీల్డింగ్ లో కూడా అద్భుత ప్రదర్శన కనబర్చేవాడు.

నిజానికి సచిన్, కోహ్లీ ఇద్దరినీ పోల్చుతూ గణాంకాలను చెయ్యడం సరైన పద్ధతి కాదు. ఇద్దరూ వేర్వేరు తరాలకి చెందినవారు. వారిద్దరూ కలిసి ఆడినది ఐదు సంవత్సరాలు మాత్రమే. ఒకవేళ ఆ కలిసి ఆడిన కాలంలో (అనగా , 2008 నుంచి 2012) వన్డే గణాంకాలని పరిశీలిస్తే సచిన్ 55 ఇన్నింగ్స్‌ లు ఆడి ఎనిమిది సెంచరీలు చేయగా కోహ్లీ 88 ఇన్నింగ్సుల్లో పదమూడు సెంచరీలు చేశాడు. ఇద్దరూ తమ కెరీర్ బెస్ట్ స్కోర్లను (సచిన్ 200 నాటౌట్, కోహ్లీ 183) ఈ ఐదేళ్ళ కాలంలోనే నమోదు చెయ్యడం గమనార్హం. ఈ ఐదేళ్ళ కాలం వరకే లెక్కిస్తే మాత్రం సచిన్ యావరేజు 60+ వుంటే కోహ్లీ బ్యాటింగ్ సగటు 40 ఉంటుంది. 

Image Credit: TwitterSachin Tendulkar

అందరూ తాము పని చేసే రంగంలో బాగా పేరుని తెచ్చుకోవాలనుకుంటారు. ఐతే, కొందరు మాత్రమే తమ పనితీరు వల్ల ఆ రంగానికే వన్నె తెస్తారు. హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ వల్ల భారతదేశంలో హాకీ క్రీడ ఎంతో ప్రసిద్ధి చెందింది. తర్వాత హాకీలో దనరాజ్ పిల్లై వంటివారు పేరు తెచ్చుకున్నారు. అలాగే, క్రికెట్ వల్ల కోహ్లీ పాపులర్ అయితే సచిన్ క్రికెట్ నే పాపులర్ చేశాడు. అందుకే, సచిన్ క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ క్రీడాకారుడయ్యాడు. 

Latest Videos

vuukle one pixel image
click me!