India Premier League 2025 GT vs KKR
India Premier League 2025 : గుజరాత్ టైటాన్స్ విజయపరంపర కొనసాగుతోంది. ఇప్పటికే వరుస విజయాలతో పాయింట్స్ టేబుల్ లో టాప్ లో నిలిచిన జిటి తాజాగా కోల్ కతా నైట్ రైడర్స్ ను వారి సొంత మైదానంలోనే ఓడించారు. దీంతో గుజరాత్ ఖాతాలోకి 12 పాయింట్లు చేరి అగ్రస్థానంలో నిలిచింది.
గుజరాత్ బ్యాంటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ అద్భుతాలు చేసింది. ఓపెనర్లు గిల్, సుదర్శన సెంచరీ భాగస్వామ్యానికి బట్లర్ మెరుపులు తోడవడంతో 198 పరుగులు చేసింది. భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కెకెఆర్ ను బౌలర్లు ఆటకట్టించారు. ఇలా జిటి ఆల్ రౌండ్ ప్రదర్శనతో అద్భుత విజయాన్ని అందుకుంది. కెకెఆర్ ను కేవలం 159 పరుగులకే కట్టడి చేసి 39 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Shubman Gill
గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ :
మొదట బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ కు ఓపెనర్లు శుభ్ మన్ గిల్, సాయి సుదర్శన్ సెంచరీ భాగస్వామ్యాన్ని అందించారు. గిల్ కేవలం 55 బంతుల్లో 90 పరుగులు సాధించాడు... కొద్దిలో సెంచరీ మిస్సయ్యాడు. మరో ఓపెనర్ సాయి సుదర్శన్ కూడా తనదైన స్టైల్ దూకుడుతో హాఫ్ సెంచరీ బాదాడు... కేవలం 36 బంతుల్లోనే 52 పరుగులు పూర్తిచేసుకున్నాడు.
చివర్లో జోస్ బట్లర్ ఊపును కొనసాగించాడు. కేవలం 23 బంతుల్లోనే 41 పరుగులు బాదాడు... ఇందులో 8 ఫోర్లు ఉన్నాయి.ఇక తెవాటియా కేవలం 5 బంతుల్లో 11 పరుగులు చేసాడు. ఇలా జిటి టాప్ ఆర్డర్ మొత్తం రాణించడంతో 198 పరుగులు చేసారు... 199 పరుగుల భారీ లక్ష్యాన్ని కెకెఆర్ ముందుంచారు.
KKR vs GT
కెకెఆర్ బ్యాటింగ్ :
కోల్ కతా నైట్ రైడర్స్ ఏ దశలోని 199 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే దిశగా సాగలేదు. కెప్టెన్ అజింక్యా రహానే బాగా ఆడినా అతడి ఇతర ఆటగాళ్ల నుండి సపోర్ట్ లభించలేదు. రహానే ఒక్కడే 50 పరుగులు చేసాడు. మిగతావారు పరుగులు సాధించడంలో ఇబ్బందిపడ్డారు.
రహ్మతుల్లా గుర్బాజ్ ను సిరాజ్ మొదటి ఓవర్లోనే ఔట్ చేసాడు. అక్కడినుండి కెకెఆర్ పతనం ప్రారంభమయ్యింది. సునీల్ నరైన్ 17, వెంకటేష్ అయ్యర్ 14, రింకూ సింగ్ 17 పరుగులు మాత్రమే చేసారు., రస్సెల్ 21 పరుగులు చేసాడు... హిట్టింగ్ కు ప్రయత్నించి అతడు ఔటయ్యాడు. ,చివర్లో రమన్ దీప్ 1, మోయిన్ అలీ 0, అగ్రిష్ రఘువంశి 27, హర్షిత్ రానా 1 పరుగులు చేసారు. బ్యాట్స్ మెన్స్ అందరు చేతులెత్తేయడంతో కెకెఆర్ కు ఓటమి తప్పలేదు.
GT vs KKR
బౌలింగ్ లోనూ గుజరాత్ దే డామినేషన్ :
కోల్ కతా నైట్ రైడర్స్ ఏ దశలోనూ గుజరాత్ బ్యాట్ మెన్స్ ను సమర్ధవంతంగా ఎదుర్కోలేదు... బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవడంతో పాటు సరైన సమయానికి వికెట్లు పడగొట్టలేకపోయారు. వైభవ్ అరోరా 4 ఓవర్లేసి 44 పరుగులు సమర్పించుకున్నాడు... కేవలం 1 వికెట్ పడగొట్టాడు. ఇక హర్షిత్ రాణా కూడా 4 ఓవర్లలో 45 పరుగులిచ్చి 1 వికెట్ తీసాడు. రస్సెల్ ఒకే ఓవర్లో 13 పరుగులు ఇచ్చాడు... కానీ 1 వికెట్ పడగొట్టాడు. మోయిన్ వికెట్లేవీ తీయకున్నా 3 ఓవర్లలో 27 పరుగులు మాత్రమే ఇచ్చాడు. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 33, నరైన్ 4 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి వికెట్లేమీ తీయలేకపోయారు.
అయితే గుజరాత్ బౌలర్లు మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేసారు. మహ్మద్ సిరాజ్ ఆరంభంలోనే వికెట్ పడగొట్టాడు. అతడు 4 ఓవర్లలో 32 పరుగులిచ్చి 2 వికెట్లు తీసాడు. ఇషాంత్ శర్మ 2 ఓవర్లలో 18 పరుగులిచ్చి 1 వికెట్, ప్రసీద్ క్రుష్ణ 4 ఓవర్లలో 25 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టారు. రషీద్ ఖాన్ 4 ఓవర్లలో 25 పరుగులిచ్చి 2 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 3 ఓవర్లలో 36 పరుగులిచ్చి 1 వికెట్,సాయి కిషోర్ 3 ఓవర్లలో 19 పరుగులిచ్చి 1 వికెట్ పడగొట్టారు.