ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 22.04.2025 మంగళవారానికి సంబంధించినవి.
కుటుంబ వ్యవహారాల్లో నిర్ణయాలు మార్చుకుంటారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇతరులకు సాయం చేస్తారు. చేపట్టిన పనుల్లో అవరోధాలు అధిగమిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు సాధారణం.
ఇంటా బయట అనుకూలం. నూతన కార్యక్రమాలు చేపడతారు. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. మిత్రులతో విహారయాత్రల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో విజయం దక్కుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకం.
అప్పుల సమస్యల వల్ల మానసిక ఇబ్బందులు తప్పవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధు మిత్రులతో మనస్పర్ధలు వస్తాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాల్లో ఇబ్బందులు వస్తాయి. వ్యాపార, ఉద్యోగాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.
నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ప్రయాణాల్లో నూతన పరిచయాలు ఏర్పడుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పాత మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. వాహనయోగం ఉంది. ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది.
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సన్నిహితుల సహాయం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలు అందుకుంటారు. ఉద్యోగంలో చిక్కులు అధిగమిస్తారు.
ఆప్తుల ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయి. కొన్ని పనుల్లో సమస్యలు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి.
ధన, వస్తు, వాహన లాభాలు ఉన్నాయి. సమాజంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు. వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత అవకాశాలు లభిస్తాయి.
చేపట్టిన వ్యవహారాల్లో అవాంతరాలు వస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో చికాకులు పెరుగుతాయి. వ్యాపారాల్లో తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహంగా ఉంటాయి.
ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటాయి. రుణ ప్రయత్నాలు అనుకూలించవు. దూర ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు వస్తాయి. ఆరోగ్యం విషయంలో డాక్టర్ ను సంప్రదించాల్సి వస్తుంది.
స్థిరాస్తి విషయంలో లాభం కలుగుతుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. వ్యాపార వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. దైవ ఆరాధన వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది.
ముఖ్యమైన పనులకు అందాల్సిన సహాయం అందుతుంది. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి. వ్యాపార, ఉద్యోగాల్లో మెరుగైన పరిస్థితులు ఉంటాయి. పిల్లల చదువు విషయాలు సంతృప్తినిస్తాయి.
వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహం కలిగిస్తాయి. ఆకస్మికంగా డబ్బు ఖర్చు కావచ్చు. ఆరోగ్యం అంతగా బాగుండదు. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులు మందకొడిగా సాగుతాయి.