సినిమాలు రీమేక్ కావడం చాలా సర్వసాధారణమే. ఒకప్పుడు చాలా సినిమాలు రీమేక్ అయ్యేవి. రీమేక్‌లతోనే స్టార్ అయిన హీరోలున్నారు. సూపర్ స్టార్లుగా రాణిస్తున్న వారు కూడా ఉన్నారు. అయితే ఒక సినిమా రీమేక్ కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ చిత్రం ఏకంగా తొమ్మిది సార్లు రీమేక్ అయ్యిందట.
ఆ మూవీ ఏంటో కాదు 2005లో విడుదలైన తెలుగు మూవీ `నువ్వొస్తానంటే నేనొద్దంటానా`. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిద్ధార్థ్, త్రిష కృష్ణన్ జంటగా నటించారు. ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించారు. ప్రభుదేవా కూడా అతిథి పాత్రలో కనిపించారు.