నెపోలియన్ కొడుకు ఆరోగ్యంపై వదంతులు, పోలీసులకు ఫిర్యాదు!

Napoleon : కోలీవుడ్‌ నటుడు నెపోలియన్ కొడుకు ధనుష్ , కోడలు అక్షయ గురించి సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న అసత్య ప్రచారాలపై నెల్లై జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. నెపోలియన్ కొడుకు ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు ధనుష్‌ ఫిజియోథెరఫిస్ట్. 

Napoleon files police complaint over son Dhanush health rumors in telugu arj
Napoleon

నటుడు నెపోలియన్:

 `ఎజమాన్`, `సీవలపేరి పాండి` వంటి సినిమాలతో ప్రేక్షకులకు సుపరిచితుడు నెపోలియన్‌. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించారు. ముఖ్యంగా `ఎజమాన్` (రౌడీ జమీందార్‌) సినిమాలో రజనీకాంత్‌కి విలన్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.

Napoleon files police complaint over son Dhanush health rumors in telugu arj
రాజకీయ నాయకుడు నెపోలియన్

రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నెపోలియన్:

1991లో వచ్చిన `పుదు నెల్లు పుదు నాట్టు` సినిమాతో మొదలుపెట్టి.. హాలీవుడ్ సినిమాల వరకు దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించారు. కొన్ని సినిమాలకు గాయకుడిగా కూడా పనిచేశారు. సినిమాల్లో నటిస్తూనే, డీఎంకేలో చేరి, విల్లివాక్కం నియోజకవర్గం నుండి పోటీ చేసి, ఎమ్మెల్యేగా గెలిచారు.


నెపోలియన్ కొడుకు ధనుష్

నెపోలియన్ కొడుకు ధనుష్:

అదేవిధంగా పెరంబూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. సినిమాలకు దూరంగా ఉన్న నెపోలియన్ తర్వాత రాజకీయాలకు కూడా దూరమై, కుటుంబంతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు. నెపోలియన్ కొడుకు ధనుష్ చిన్నప్పటి నుండే కండరాల వ్యాధితో బాధపడుతున్నారు. నడవలేకపోతున్నారు. నెపోలియన్ తన కొడుకును జాగ్రత్తగా చూసుకుంటున్నారు.

ధనుష్ వివాహం

పెద్ద కొడుకు ధనుష్‌కి జపాన్‌లో వివాహం:

గత ఏడాది తన పెద్ద కొడుకు ధనుష్‌కి జపాన్‌లో ఘనంగా వివాహం జరిపించారు. అమెరికాలో స్థిరపడినా, తన కొడుకుకి తమిళ సంస్కృతి ఉన్న అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని నెపోలియన్ భావించారు. అందుకే తన బంధువు అమ్మాయి అక్షయను ధనుష్‌కిచ్చి పెళ్లి చేశారు.

ధనుష్ ఆరోగ్యంపై వదంతులు

ధనుష్ ఆరోగ్యంపై వ్యాపించిన వదంతులు:

ధనుష్ ఆరోగ్యం, అతని భార్య అక్షయ గురించి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోందని, ధనుష్‌కు చికిత్స అందిస్తున్న ఫిజియోథెరపిస్ట్ డేనియల్ రాజా, నెపోలియన్ తరపున నెల్లై జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు.

పోలీసులకు ఫిర్యాదు

నెల్లై పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయంలో ఫిర్యాదు:

ధనుష్ ఆరోగ్యం, అతని భార్య అక్షయ గురించి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోంది. వదంతులు వ్యాప్తి చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటన కలకలం రేపింది.

ఇదిలాఉంటే ధనుష్‌ పెళ్లి సమయంలో కూడా అనేక రూమర్స్ వచ్చాయి. అమ్మాయికి డబ్బు ఆశ చూపి పెళ్లి చేస్తున్నావా? అంటూకామెంట్స్ వచ్చాయి. అప్పుడు వాటిని తిప్పికొట్టాడు నెపోలియన్‌. ఇప్పుడు మరోసారి ధనుష్‌ ఆరోగ్యంపైరూమర్స్ రావడం విచారకరం. 

read  more: 9 సార్లు రీమేక్‌ అయిన త్రిష మూవీ ఏంటో తెలుసా? తెలుగులో అది బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌

also read:  `పాడుతా తీయగా`లో మరో బాగోతం, గిఫ్ట్స్ ఇస్తే ఫేవర్‌గా జడ్జ్ మెంట్‌.. లేడీ సింగర్ మరో సంచలన ఆరోపణ

Latest Videos

vuukle one pixel image
click me!