`మ్యాడ్‌ 2` ఓటీటీ రిలీజ్‌ డేట్‌.. ఇంత తొందరగానా? ఎప్పుడంటే?

Mad 2 Ott: కామెడీ సినిమాలకు ఇప్పుడు మంచి ఆదరణ లభిస్తుంది. ఈ సమ్మర్‌లో వచ్చిన `మ్యాడ్‌ స్కేర్‌` మూవీ ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. కథ లేకపోయినా సందర్భానుసారంగా వచ్చే కామెడీతోనే సినిమాని తీశారు. సక్సెస్‌ అయ్యారు. గత నెలలో విడుదలైన ఈ మూవీ పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. మరి ఆ కథేంటో చూస్తే. 

mad 2 movie ott release date its really surprised in telugu arj

Mad 2 Ott: ఇటీవల ఆడియెన్స్ కి బాగా నవ్వులు పూయించిన మూవీ `మ్యాడ్‌ 2`. రెండేళ్ల క్రితం వచ్చిన `మ్యాడ్‌` చిత్రానికి రీమేక్‌. కళ్యాణ్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ గత నెల చివర్లో విడుదలైన విషయం తెలిసిందే. రామ్‌ నితిన్‌, నార్నే నితిన్‌, సంగీత్‌శోభన్‌ హీరోలుగా నటించిన ఈ మూవీలో విష్ణు కీలక పాత్ర పోషించారు. సునీల్‌, మురళీధర్‌ గౌడ్‌, సత్యం రాజేష్‌ ముఖ్య పాత్రలు పోషించారు. హిలేరియస్‌కామెడీ ఎంటర్‌టైనర్ గా ఈ మూవీ ఆడియెన్స్ ని అలరించింది. 

`మ్యాడ్‌ 2` ఓటీటీ రిలీజ్‌ డేట్‌

థియేటర్లో సమ్మర్‌లో నవ్వులు పూయించిన ఈ చిత్రం ఇప్పుడు బుల్లితెర ఆడియెన్స్ ని అలరించబోతుంది. ఓటీటీ ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్‌ చేయడానికి వస్తుంది. తాజాగా `మ్యాడ్‌ 2` ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫైనల్‌ అయ్యింది. ఈ వారమే ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ నెల 25న ఓటీటీలో స్ట్రీమింగ్‌కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. 

తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో `మ్యాడ్‌ 2` స్ట్రీమింగ్‌..

Latest Videos

నెట్‌ ఫ్లిక్స్ లో `మ్యాడ్‌ స్వ్కేర్‌` స్ట్రీమింగ్‌ కానుంది. గురువారం అర్థరాత్రి నుంచే ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో కూడా ఈ మూవీ ఓటీటీలో అందుబాటులో ఉండటం విశేషం. కామెడీ ఎంటర్‌టైనర్‌ చిత్రాలను ఇష్టపడే వారికి ఇదొక మంచి ట్రీట్ అని చెప్పొచ్చు. రెండున్నరగంటలపాటు హిలేరియస్‌గా నవ్వుకోవచ్చు. 

`మ్యాడ్ 2` థియేట్రికల్‌ కలెక్షన్లు

ఇక ఈ మూవీని సూర్య దేవర నాగవంశీ నిర్మించిన విషయం తెలిసిందే. మార్చి 28న విడుదలైన ఈ మూవీ సుమారు 70కోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది. చిన్న సినిమాల్లో పెద్ద విజయం సాధించింది. కథ పరంగా చూస్తే ఇందులో పెద్దగా కథ లేదు. కేవలం సందర్భానుసారంగా వచ్చే కామెడీ ఆధారంగా చేసుకుని మూవీని రూపొందించారు కళ్యాణ్‌ శంకర్‌. ఆ కామెడీ బాగా వర్కౌట్‌ అయ్యింది. ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. మరి ఓటీటీలో ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుందో చూడాలి. 
 

vuukle one pixel image
click me!