ఏసీ కొనడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఏదోలా కష్టపడి కొన్నా.. 24 గంటలు AC వాడితే భరించలేనంత కరెంటు బిల్లు వస్తుంది. పైగా ఎక్కువ సమయం ఏసీ కింద ఉంటే శరీరంలో తేమ తగ్గుతుంది. దీనికి బదులు కూలర్ ని వాడితే ఖర్చు తగ్గుతుంది. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవు. కానీ కూలర్ చల్లగాలి ఇవ్వడం లేదని చాలామంది ఫిర్యాదు చేస్తుంటారు. దీనికి చెక్ పెట్టేలా కొన్ని సులభమైన చిట్కాలతో కూలర్‌ను AC లాగా చల్లగా మార్చుకోవచ్చు. కూలర్ గడ్డిని మార్చడం, ఐస్ వాటర్ వేయడం, సరైన స్థలంలో ఉంచడం వంటి స్మార్ట్ చిట్కాలు పాటించండి మరి.