విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో విద్యార్థిని బంధువు ఇంటికి పిలిచి విద్యార్థిని రేప్ చేశాడు. టీచర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చిత్తూరు: సభ్య సమాజం తలదించుకునే సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగింది. విద్యాబుద్ధులు చెప్పి, నడతను సరిచేయాల్సిన ఉపాధ్యాయుడే సిగ్గుమాలిన పని చేశాడు,. ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినిపై అత్యాచారం చేశాడు.
నగరికి చెందిన నవీన్ కుమార్ అనే 28 ఏళ్ల ఉపాధ్యాయుడు బి. కొత్తకోటలోని ఓ పాఠశాలలో కాంట్రాక్ట్ టీచర్ గా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో మదనపల్లెకు చెందిన 14 ఏళ్ల బాలిక చదువుతోంది. సంక్రాంతి సెలవుల కోసమని బాలిక ఇంటికి వచ్చింది.
నవీన్ కుమార్ కూడా మదనపల్లెలోని తన సమీప బంధువు ఇంటికి వచ్చాడు. శుక్రవారం బాలిక వీధిలో ఒంటరిగా ఉన్నప్పుడు విద్యార్థినితో అంతకు ముందు ఉన్న పరిచయంతో మాటలు కలిపాడు. ఎవరూౌ లేని సమయం చూసుకుని తన బంధువు ఇంటికి తీసుకుని వెళ్లి అత్యాచారం చేశాడు.
Also Read: స్టూడెంట్‌పై ల్యాబ్‌లోనే అసిస్టెంట్ ప్రోఫెసర్ అత్యాచారం
ఆ విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పింది. జరిగిన సంఘటనపై బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు ఉపాధ్యాయుడైన నవీన్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు.
ఆ మధ్య హైదరాబాదులో అటువంటి సంఘటనే జరిగింది హైదరాబాదులోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ అత్యాచారం చేశాడు. మల్లకంటి వెంకటయ్య అనే అసిస్టెంట్ ప్రొఫెసర్ విద్యార్థినిని కాలేజీలోని ల్యాబ్ కు పిలిచి ఆమెపై అత్యాచారం చేశాడు.