తిరుపతి జూపార్క్ లో విషాదం: సెల్ఫీ కోసం ఎన్‌క్లోజర్‌లోకి, సింహం దాడిలో వ్యక్తి మృతి

Published : Feb 15, 2024, 04:13 PM ISTUpdated : Feb 15, 2024, 04:38 PM IST
తిరుపతి జూపార్క్ లో విషాదం: సెల్ఫీ కోసం ఎన్‌క్లోజర్‌లోకి, సింహం దాడిలో వ్యక్తి మృతి

సారాంశం

తిరుపతి నగరంలో  ఇవాళ  విషాదం చోటు చేసుకుంది.  లయన్ జోన్ లోకి వెళ్లిన వ్యక్తిని  సింహం చంపింది.

తిరుపతి: నగరంలోని జూపార్క్ లో  గురువారంనాడు విషాదం చోటు చేసుకుంది.  లయన్ జోన్ లోకి వెళ్లిన వ్యక్తిని  సింహం చంపేసింది.లయన్ ఎన్‌క్లోజర్ లోకి  ఓ వ్యక్తి ఇవాళ వెళ్లాడు.సెల్ఫీ కోసం  ఓ వ్యక్తి  సింహం తిరిగే ప్రాంతంలోకి వెళ్లాడు. అయితే  ఆ వ్యక్తిని చూసిన సింహం  గాండ్రించింది. దీంతో భయపడిన వ్యక్తి చెట్టు ఎక్కాడు. అయితే  ప్రమాదవశాత్తు ఆ వ్యక్తి చెట్టుపై నుండి కింద పడ్డాడు. దీంతో సింహం ఆ వ్యక్తిపై దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు

ఈ తరహా ఘటనలు  దేశంతో పాటు విదేశాల్లోని పలు జూపార్క్ లలో గతంలో చోటు చేసుకున్నాయి.  జూపార్క్ లలో పులులు, సింహాలు, ఏనుగులు ఉన్న ప్రదేశాలకు  మనుషులు వెళ్లకుండా జూపార్క్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే  జూపార్క్ సిబ్బంది కళ్లుగప్పి కొందరు  పులులు, సింహాలు తిరిగే ప్రాంతాలకు వెళ్లి  ప్రమాదాల బారిన పడిన ఘటనలు కూడ లేకపోలేదు.2019  జనవరి  20న   జిరాక్ పూర్ లో మొహేంద్ర చౌదరి జులాజికల్ పార్క్ లో  22 ఏళ్ల వ్యక్తిని సింహం చంపింది.పంజాబ్ రాష్ట్రంలోని మహేంద్ర చౌదరి జూపార్క్ లో  సింహల దాడిలో ఓ వ్యక్తి మరణించిన ఘటన 2019 జూన్ 21న జరిగింది.

ఘనా దేశంలోని జూపార్క్ లో  సింహం దాడిలో  ఓ వ్యక్తి మరణించిన ఘటన 2022 ఆగస్టు 30న చోటు చేసుకుంది.పాకిస్తాన్ లోని లాహోర్ లో   ఓ వ్యక్తిపై సింహం దాడి చేయడంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన 2023 డిసెంబర్ 13న చోటు చేసుకుంది. సెల్ఫీ కోసం  లయన్ ఎన్ క్లోజర్ వద్దకు వెళ్లిన  మహమ్మద్ అమీన్ అనే వ్యక్తిపై సింహం దాడి చేసింది. బహవాల్ పూర్ లోని సఫారీ జూ పార్క్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం