కొత్త కారు కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 6 లక్షలకే టాటా టిగోర్‌

First Published | Jan 10, 2025, 1:04 PM IST

కారు కొనుగోలు చేయాలనేది చాలా మందికి డ్రీమ్. ఒకప్పుడు కేవలం ధనిక కుటుంబాలకే పరిమితమైన ఈ కోరిక ఇప్పుడు మధ్య తరగతి కుటుంబాల్లో కూడా మొదలైంది. బ్యాంకులు ఈఎమ్ఐ ఆఫర్లు అందిస్తుండడం. కంపెనీలు తక్కువ ధరలోనే కార్లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టాటా మార్కెట్లోకి తక్కువ బడ్జెట్ లో కొత్త కారును తీసుకొచ్చింది.. 

2025 టాటా టిగోర్ ఫేస్‌లిఫ్ట్

ప్రముఖ దేశీయ ఆటో మొబైల్ సంస్థ టాటా మోటార్స్ మార్కెట్లోకి కొత్త కారును లాంచ్ చేసింది. టాటా టిగోర్ పేరుతో ఈ కారును తీసుకొచ్చారు. మారుతి సుజుకి డిజైర్, హోండా అమేజ్ ఫేస్ లిఫ్ట్ కార్లకు ఈ కొత్త కారు పోటీనిస్తుంది. 

టాటా మోటార్స్

టాటా టిగోర్ బేస్ వేరియంట్ లో స్మార్ట్ స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త సీట్లు, ISOFIX, పార్కింగ్ సెన్సార్లు వంటి ఫీచర్లను అందించారు. 


2025 టాటా టిగోర్ ఫీచర్లు

ఫీచర్ల విషయానికొస్తే XZ+ టాప్ మోడల్‌లో 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 360 డిగ్రీలతో కూడిన  కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లను ఇచ్చారు. 

టాటా టిగోర్

ఈ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ అందించారు. ఎక్స్ఎమ్ బేస్ వేరియంట్ ధరఎక్స్ షోరూమ్ ప్రైజ్ ధర రూ. 5.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 

ఇతర వేరియంట్స్..

ఇక ఇతర వేరియంట్స్ విషయానికొస్తే ఎక్స్ఎమ్ వేరియంట్ ధర ఎక్స్ షోరూమ్ ప్రైజ్ రూ. 6.60 లక్షలు కాగా టాప్ వేరియంట్ ధర రూ. 8.5 లక్షలుగా ఉంది. ఇక సీఎన్జీ వేరియంట్ విషయానికొస్తే ఈ కారు రూ. 7.7 లక్షల నుంచి రూ. 9.5 లక్షల వరకు ఉంది.  

Latest Videos

click me!