తిరుమల : శ్రీవారి లడ్డూ ధరపై ఈవో ధర్మారెడ్డి కీలక ప్రకటన

By Siva KodatiFirst Published Mar 2, 2024, 9:17 PM IST
Highlights

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరలను ఎట్టి పరిస్ధితుల్లో తగ్గించేది లేదన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. బ్రహ్మోత్సవాలు , వైకుంఠ ఏకాదశి తదితర పర్వదినాల్లో తప్పించి మిగిలిన సమాయాల్లో ఎన్ని లడ్లు కావాలంటే అన్ని పొందవచ్చన్నారు. 

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరలను ఎట్టి పరిస్ధితుల్లో తగ్గించేది లేదన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. శనివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భాగంగా భక్తులతో ఫోన్‌లో మాట్లాడిన ఆయన.. లడ్డూ బరువు, పరిమాణం ఏమాత్రం తగ్గలేదని క్లారిటీ ఇచ్చారు. శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఒక ఉచిత లడ్డూ అందిస్తున్నామని, బ్రహ్మోత్సవాలు , వైకుంఠ ఏకాదశి తదితర పర్వదినాల్లో తప్పించి మిగిలిన సమాయాల్లో ఎన్ని లడ్లు కావాలంటే అన్ని పొందవచ్చన్నారు. ఇదిలావుండగా.. శ్రీవారి ఆలయంలో సేవలందించేందుకు ముందుకు రావాలని యువతకు ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. 

తిరుమలలో భక్తులు సేవలందించేందుకు ప్రస్తుతం వున్న 65 ఏళ్ల పరిమితిని 60 ఏళ్లకు కుదించాలని భక్తులు కోరగా.. దీనికి ఈవో నిరాకరించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా దర్శనం, సేవా టికెట్లు పొందిన భక్తులకు వసతి సదుపాయం అందుబాటులోకి వస్తుందన్నారు. 50 ఏళ్ల క్రితం నిర్మించిన సప్తగిరి విశ్రాంతి గృహాలను ఆధునీకరిస్తామని ధర్మారెడ్డి వెల్లడించారు. 

ఇదిలావుండగా.. తిరుపతి కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన శనివారం సూర్యప్రభ వాహనంపై శ్రీకపిలేశ్వర స్వామివారు పురవీధుల్లో ఊరేగారు. అనంతరం స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది. శ్రీ స్కోమస్కందమూర్తి, శ్రీకామాక్షి దేవి అమ్మవారికి పాలు , పెరుగు, తేనే, పండ్ల రసాలు , చందనంతో అభిషేకం నిర్వహించారు. 

click me!