Lifestyle

ఈ లక్షణాలున్నాయా? కిడ్నీ సమస్య కావొచ్చు..

Image credits: Getty

మూత్ర విసర్జన

రాత్రిపూట తరచూ మూత్ర విసర్జన చేయాల్సి రావడం. మూత్రం వచ్చినట్లు అనిపించినా రాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే కిడ్నీ సమస్యలకు సంకేతంగా చెప్పొచ్చు. 
 

Image credits: our own

రక్తహీనత

కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్న వారిలో ఎర్ర రక్తకణాల సంఖ్య తగ్గుతుంది. దీంతో రక్తహీనత సమస్య వస్తుంది. బలహీనత, తలతిప్పడం వంటి లక్షణాలు కనిపిస్తే కిడ్నీ ఆరోగ్యం పాడవుతున్ట్లు భావించాలి. 
 

Image credits: Getty

రుచి తెలియకపోవడం

నిత్యం నోరు చప్పబడినట్లు అనిపించినా, తీసుకుంటున్న ఆహారం రుచి తెలియకపోవడం కూడా కిడ్నీ సమస్యలకు లక్షణంగా చెప్పొచ్చు. 
 

Image credits: Getty

నోటి దుర్వాసన

నోటి దుర్వాసన కూడా కిడ్నీ సంబంధిత సమస్యలకు ప్రాథమిక సంకేతమని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలం ఈ సమస్య ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. 
 

Image credits: Getty

ఆకలి తగ్గడం

కిడ్నీ సమస్యలున్న వారిలో వికారం, వాంతి, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. 
 

Image credits: Getty

చర్మ సమస్యలు

కిడ్నీ ఆరోగ్యంలో ఇబ్బందులు ఉంటే చర్మం పొడి బారడం, దురదలు వంటి సమస్యలు వెంటాడుతాయని నిపుణులు చెబుతున్నారు. 
 

Image credits: social media

గమనిక

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 

Image credits: our own

వీళ్లు అరటిపండు తినొద్దా?

షిఫాన్ చీరలపై మరకలు తొలగించేదెలా?

100 ద్వీపాల నగరాన్ని చూస్తారా: గోవా కంటే బాగుంటుంది

అన్నానికి బదులు వీటిని తింటే బరువు తగ్గడం పక్కా