సీఎం అభ్యర్ధిగా చిరంజీవి: కాంగ్రెస్ నేత చింతామోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు

By narsimha lodeFirst Published Jan 13, 2024, 1:08 PM IST
Highlights


కాంగ్రెస్ పార్టీ తరపున  సీఎం అభ్యర్ధిగా  చిరంజీవి బరిలోకి దిగాలని  ఆ పార్టీ నేత చింతా మోహన్ కోరారు.

తిరుపతి:  రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి  నుండి చిరంజీవి పోటీ చేస్తే సీఎం కావడం ఖాయమని  కాంగ్రెస్ నేత చింతా మోహన్ వ్యాఖ్యానించారు. శనివారం నాడు  తిరుపతిలో  చింతా మోహన్ మీడియాతో మాట్లాడారు.  కాపు సామాజిక వర్గం నేతలు సీఎం కావాలని కోరుకుంటున్నారన్నారు. సీఎం కావాలంటే  కాపు సామాజిక వర్గానికి ఈ ఎన్నికలు సువర్ణ అవకాశంగా ఆయన  పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున  చిరంజీవి సీఎం అభ్యర్ధిగా  బరిలోకి దిగితే ఆయనకు ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశం ఉందన్నారు. 

also read:వైఎస్ఆర్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు: బాబుతో భేటీ తర్వాత షర్మిల

సీఎం  అభ్యర్ధిగా  కాంగ్రెస్ పార్టీ తరపున చిరంజీవి బరిలోకి దిగాలని ఆయన  కోరారు. తిరుపతి అసెంబ్లీ స్థానంలో చిరంజీవి పోటీ చేస్తే  ఆయనను 50 వేల మెజారిటీతో గెలిపిస్తామని  చింతా మోహన్ హామీ ఇచ్చారు.అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై  నిర్ణయం తీసుకోవాల్సింది చిరంజీవేనన్నారు.

also read:ఎంపీ టిక్కెట్టు జేబులో ఉంది,కానీ..: గుమ్మనూరు జయరాం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండియా కూటమి పోటీకి  మంచి మెజారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  130 అసెంబ్లీ, 20  పార్లమెంట్ స్థానాల్లో ఇండియా కూటమి  విజయం సాధిస్తుందని  ఆయన ధీమాను వ్యక్తం చేశారు.  కాకినాడ పార్లమెంట్ స్థానం నుండి సీపీఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని పోటీ చేయాలని ఆయన కోరారు. నగరి అసెంబ్లీ స్థానం నుండి సీపీఐ జాతీయ కార్యదర్శి పోటీ చేయాలని  చింతా మోహన్ కోరారు.ఈ నెల  4వ తేదీన కాంగ్రెస్ పార్టీలో వై.ఎస్. షర్మిల చేరారు.  కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఫోకస్ పెట్టింది.  కాంగ్రెస్ పార్టీలో షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం సాగుతుంది.  

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో  ఈ ఎన్నికల్లో  కనీసం  15 శాతం ఓట్లను సాధించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ వ్యూహరచన చేస్తుంది.

also read:నామినేటేడ్ పదవుల భర్తీకి రేవంత్ కసరత్తు:కోదండరామ్‌కు ఎమ్మెల్సీ?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ప్రజా రాజ్యం పార్టీని  సినీ నటుడు చిరంజీవి ఏర్పాటు చేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికలకు ముందు   ప్రజా రాజ్యం పార్టీని చిరంజీవి ప్రకటించారు.  2009 ఎన్నికల్లో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  18 అసెంబ్లీ స్థానాల్లో  ప్రజా రాజ్యం దక్కించుకుంది.  ఆ తర్వాత కొంతకాలానికే  ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు చిరంజీవి.  కేంద్ర మంత్రిగా  చిరంజీవికి  కాంగ్రెస్ పదవిని ఇచ్చింది.  2014 ఎన్నికలకు ముందు రాష్ట్ర విభజన ఆనాడు  కేంద్ర మంత్రిగా ఉన్న చిరంజీవి వ్యతిరేకించారు. కాంగ్రెస్ పార్టీకి కూడ  దూరంగా ఉంటున్నారు. రాజకీయాలకు దూరంగా ఉండాలని  ఉంటున్నారు.  ఈ తరుణంలో చింతా మోహన్ వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.

click me!