వాస్తు టిప్స్: స్నానం తర్వాత మహిళలు చేయకూడని తప్పులు ఇవే..!

First Published | Jan 10, 2025, 1:21 PM IST

ముఖ్యంగా స్త్రీలు.. స్నానం చేసిన తర్వాత  కొన్ని తప్పులు చేయకూడదట. ఎలాంటి తప్పులు చేయకూడదో  తెలుసుందాం..
 

Bathing in cold water

హిందూ ధర్మంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రాచీన కాలం నుంచి  వాస్తు శాస్త్రాన్ని నమ్ముతూ వస్తున్నారు. అయితే.. వాస్తు అంటే.. ఇల్లు ఎలా కట్టుకోవాలి? ఏ దిక్కులో  ఏం ఉండాలి అనే విషయం తెలిస్తే చాలు అని చాలా మంది అనుకుంటారు. కానీ.. మనం చేసే చాలా పనులపై కూడా వాస్తు ప్రభావం ఉంటుంది. అందుకే.. చాలా పనులు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా స్త్రీలు.. స్నానం చేసిన తర్వాత  కొన్ని తప్పులు చేయకూడదట. ఎలాంటి తప్పులు చేయకూడదో  తెలుసుందాం..

బకెట్లో మురికి నీరు వదిలేయడం
చాలా మంది చేసే సాధారణ తప్పులలో ఒకటి బట్టలు ఉతకడం లేదా స్నానం చేసిన తర్వాత బకెట్లో మురికి నీటిని వదిలేయడం. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశిస్తాయి, ఇది ఇంటిలోని ప్రశాంతత, ఆనందాన్ని దెబ్బతీస్తుంది.
 


స్నానం తర్వాత పదునైన వస్తువులు వాడటం
స్నానం చేసిన వెంటనే గోళ్ళ కట్టర్, రేజర్ లేదా బ్లేడ్ వంటి పదునైన వస్తువులను ఎప్పుడూ ఉపయోగించకూడదు. ఇది మీ జీవితంలోకి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది, ఇది అనవసరమైన ఇబ్బందులు, ఒత్తిడికి కారణం కావచ్చు.


బాత్రూంలో ఖాళీ బకెట్ ఉంచడం
బాత్రూంలో ఖాళీ బకెట్ ఉంచడం అశుభం. బకెట్ లేదా టబ్‌లో ఎల్లప్పుడూ నీరు నింపి ఉంచాలి. అలా చేయడం సాధ్యం కాకపోతే, బకెట్‌ను తలక్రిందులుగా ఉంచండి.

బాత్రూమ్ తడిగా వదిలేయడం
స్నానం చేసిన తర్వాత బాత్రూమ్ నేలను వైపర్‌తో తుడిచి ఆరబెట్టడం చాలా ముఖ్యం. బాత్రూమ్ తడిగా ఉండటం ఆర్థిక అస్థిరతకు కారణమవుతుంది, డబ్బుకు సంబంధించిన సమస్యలను తెస్తుంది.
 

స్నానం తర్వాత వెంటనే సింధూరం పెట్టుకోవడం
వివాహిత స్త్రీలు స్నానం చేసిన వెంటనే జుట్టుకు సింధూరం పెట్టుకోవడం మంచిది కాదు. ఇలా చేయడం వల్ల మనశ్శాంతి దెబ్బతింటుంది, చెడు ఆలోచనలు వస్తాయి.
 

Latest Videos

click me!