కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నందమూరి హరికృష్ణ కూతురు సుహాసినికి రూ.52లక్షల41వేల493 ఆస్తులతో పాటు రూ.4 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని ప్రకటించింది.
హైదరాబాద్:కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నందమూరి హరికృష్ణ కూతురు సుహాసినికి రూ.52లక్షల41వేల493 ఆస్తులతో పాటు రూ.4 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని ప్రకటించింది.
కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా సుహాసిని బరిలోకి దింపింది.నవంబర్ 17వ తేదీన సుహాసిని కూకట్‌పల్లిలో నామినేషన్ దాఖలు చేసింది.కూకట్‌పల్లిలో నామినేషన్ దాఖలు చేసిన సుహాసిని దాఖలు చేసిన అఫిడవిట్‌లో తన ఆస్తులు, అప్పుల వివరాలను ప్రకటించింది.
2017-18 లో తనకు రూ.10,53,300 వార్షికాదాయం ఉందని తెలిపింది. తన కొడుకు శ్రీహర్షకు రూ.12 లక్షల వార్షికాదాయం ఉందని పేర్కొంది. సుహాసిని భర్త వెంకటశ్రీకాంత్ వార్షికాదాయం ఏమీ లేదని చెప్పారు.
తనకు ఒక హ్యూందాయ్ కారుతో పాటు 2,222 గ్రాముల బంగారు నగలు, 30 లక్షల విలువైన వజ్రాభరణాలతో పాటు కోటి 52లక్షల41వేల493 విలువైన ఆస్తులున్నాయని ప్రకటించింది.అంతేకాదు రూ.4కోట్ల30 లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నట్టు ప్రకటించింది.
సుహాసిని భర్త శ్రీకాంత్‌కి రూ.65 లక్షల విలువైన స్థిరాస్తులు, కుమారుడు శ్రీకాంత్ పేరిట రూ.88 లక్షల 38 వేల విలువైన స్థిరాస్తి ఉందని ప్రకటించింది.కోటీ 2 లక్షల 60 వేల రూపాయలు విలువైన చరాస్తులు ఉన్నట్టు పేర్కొన్నారు.
మిక్ ఎలక్ట్రిక్ సంస్థలో తన పేర రూ.4 లక్షల 50 వేల విలువైన పెట్టుబడులు, శ్రీ భవాని కాస్టింగ్ లిమిటెడ్‌లో భర్త పేరున 5 లక్షల విలువైన షేర్లు, కుమారుడి పేరున లక్షా 50వేల విలువైన ఎస్‌బీఐ పాలసీ ఉన్నట్టు వివరించారు. తనపై ఎలాంటి కేసులూ లేవని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు
కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సుహాసిని
సుహాసినికి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంపై స్పందించిన బాలయ్య
ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన నందమూరి సుహాసిని
బరిలోకి సుహాసిని: తెర వెనక భువనేశ్వరి
మాధవరం తెలుగుదేశం ద్రోహి, అతన్ని ఓడిస్తా.. సుహాసిని నా బిడ్డ: పెద్దిరెడ్డి
అందుకే రాజకీయాల్లోకి వచ్చా, తండ్రిని తల్చుకొని కన్నీళ్లు పెట్టుకొన్న సుహాసిని
హరికృష్ణ సానుభూతి, ఎన్టీఆర్ ఛరిష్మా: టీడీపీ తురుపుముక్క సుహాసిని
నందమూరి సుహాసినీపై.. మిత్రపక్షం కాంగ్రెస్ తిరుగుబాటు
కూకట్‌పల్లి సుహాసినికి కేటాయింపు: బాబు వద్దకు పెద్దిరెడ్డి
మీడియా ముందుకు నందమూరి సుహాసిని
33 ఏళ్ల తర్వాత తెలంగాణలో నందమూరి ఫేటు ఎలా ఉందో, నాడు ఎన్టీఆర్...నేడు సుహాసిని
‘‘ఆ’’ సాయమే హరికృష్ణ కుమార్తె సుహసిని మనసు మార్చిందా..?
హరికృష్ణ కుమార్తెకే కూకట్ పల్లి టిక్కెట్, 17న సుహాసిని నామినేషన్
సుహాసిని కోసం జూ.ఎన్టీఆర్: ప్రచారానికి బాలయ్య, విజయశాంతి జోడి
చంద్రబాబుతో భేటీ: కూకట్‌పల్లి సీటు హరికృష్ణ కూతురు సుహాసినికే
తెరపైకి హరికృష్ణ కూతురి పేరు: కూకట్‌పల్లిపై ఉత్కంఠ
హరికృష్ణ కూతురు పోటీకి జూ.ఎన్టీఆర్ బ్రేక్
కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కుమార్తె..?