ఒక వ్యక్తి ఆలోచించిందే అమలు చేశారు: కేసీఆర్‌పై రాహుల్

By narsimha lodeFirst Published Nov 23, 2018, 7:45 PM IST
Highlights

అమరవీరుల త్యాగాలు, సోనియా సంకల్పంతో తెలంగాణ ఏర్పడిందని  కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ చెప్పారు. నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందన్నారు.
 

హైదరాబాద్:  అమరవీరుల త్యాగాలు, సోనియా సంకల్పంతో తెలంగాణ ఏర్పడిందని  కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ చెప్పారు. నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందన్నారు.

శుక్రవారం నాడు మేడ్చల్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సభలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ పాల్గొన్నారు.  ఈ సభ  ఎంతో చారిత్రాత్మకమైందన్నారు రాహుల్ గాంధీ. 

కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ చెప్పారు.తెలంగాణ పోరాటాన్ని సోనియా గాంధీ వెలిబుచ్చారని చెప్పారు.  తెలంగాణ పోరాటాన్ని సోనియా గాంధీ అర్ధం చేసుకొన్నారని చెప్పారు. తెలంగాణ పోరాటంలో సోనియా మీ పక్కన నిలబడ్డారని ఆయన గుర్తు చేసుకొన్నారు.

ఒక వ్యక్తి ఆలోచించిందే అమలు చేశారని కేసీఆర్ పై రాహుల్ విమర్శలు గుప్పించారు.  తెలంగాణ ప్రజల ఉద్యమం, పోరాటం వల్లే   రాష్ట్రం ఏర్పడిందన్నారు. టీఆర్ఎస్ పాలనను చరమ గీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలు కూటమిగా ఏర్పడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

మీ ఆకాంక్షల కోసం రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొన్నామో  ఆ ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. ప్రజా కూటమి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడితే తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తోందన్నారు. టీఆర్ఎస్ తరహాలో కూటమి పాలన ఉండదన్నారు.తెలంగాణ ప్రజల జీవితాలను బాగుపడేలా పాలన సాగిస్తామన్నారు. 

సంబంధిత వార్తలు

ఏళ్ల తర్వాత నా బిడ్డల వద్దకు వచ్చినట్లుంది: సోనియా

సీన్ రివర్స్: 'చేయ్యె'త్తి జైకొడుతున్న ఉద్యమ నేతలు

సెంటిమెంట్: తొలిసారి తెలంగాణ రాష్ట్రానికి సోనియా

ఉద్యోగులకు, పేదలకు ఉత్తమ్ వరాల జల్లు

రెండు రోజుల్లో మా వైపు టీఆర్ఎస్ కీలక నేతలు: ఉత్తమ్ సంచలనం

టీఆర్ఎస్ ఎంపీలే కాదు...ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్‌లోకి: రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ చరిత్రలో తొలిసారి: రంగంలోకి దిగిన ఆరుగురు అగ్రనేతలు

రెబల్స్‌ను బుజ్జగించేందుకు రంగంలోకి జైరాం రమేశ్

సామ రంగారెడ్డికి చంద్రబాబు షాక్: 12 సీట్లకే టీడీపి పరిమితం

టీడీపీకి షాక్: ఇబ్రహీంపట్నంలో మల్‌రెడ్డికి కాంగ్రెస్ మద్దతు

రంగంలోకి కాంగ్రెస్ అగ్రనేతలు: రెబెల్స్‌కు బుజ్జగింపులు

చంద్రబాబుతో తెలంగాణకు ప్రమాదం: కేసీఆర్

లగడపాటికి భలే గిరాకీ: వ్యక్తులపై నో, తెలంగాణ ఎగ్జిట్ పోల్ సర్వేకే సై

 

click me!