ప్రణయ్ హత్య.. కులాన్ని ఈ దేశం నుంచి తీసెయ్యలేరు: గాయని చిన్మయి

By Arun Kumar PFirst Published Sep 17, 2018, 9:36 AM IST
Highlights

మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసుపై ప్రముఖ నేపథ్య గాయని చిన్మయి శ్రీపాద స్పందించారు. ప్రణయ్ హత్యను తమిళనాడులోని కౌసల్య-శంకర్‌ల హత్యతో పోల్చుతూ తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో ఓ లేఖను పోస్ట్ చేశారు.

మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసుపై ప్రముఖ నేపథ్య గాయని చిన్మయి శ్రీపాద స్పందించారు. ప్రణయ్ హత్యను తమిళనాడులోని కౌసల్య-శంకర్‌ల హత్యతో పోల్చుతూ తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో ఓ లేఖను పోస్ట్ చేశారు. భారత్‌లో కులం పేరు చెప్పుకోకుండా ఏ రాజకీయ నాయకుడు, సినీ నటుడు ఎవ్వరూ మనుగడ సాగించలేరని.. అది వ్యవస్థలో అంతర్భాగమన్నారు.

నగరాల్లో నివసించే ఎంతోమంది తమ పక్కవారి కులం ఏంటో తెలుసుకోవాలని తాపత్రయపడతారన్నారు. కులాన్ని అడ్డు పెట్టుకుని పెద్ద పెద్ద కేసుల నుంచి చాలా మంది బయటపడుతున్నారని ఆరోపించారు. కులం పేరుతో అణచివేయడమనేది ఈ దేశంలో భయంకరమైన నిజమన్నారు. అగ్రవర్ణాల వారి బావిలో నీళ్లు తాగారని తక్కువ కులం వారి పిల్లలను చితకబాదిన సంఘటనలు అనేకం ఉన్నాయన్నారు.

‘‘నీళ్లకు, మట్టికి కులం సర్టిఫికేట్ ఇవ్వడంలో భారతీయులు సక్సెస్ అయ్యారన్నారు. పేరు చివర తోక తీసేయడం మొదట చేయాల్సిన పనని.. అయితే అదేదో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో పేర్ల చివరన క్యాస్ట్ తీసేస్తే మార్పు సాధించినట్లు కాదు.. అంతరాల్లో చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఒకే కులంలో కూడా ఆర్థిక స్థితిగతులు, అమెరికా వీసా లాంటివి పెళ్లి సంబంధాల్లో ప్రధాన అంశాలయ్యాయన్నారు.

కుల పిచ్చి అన్ని మతాల్లో ఉందని...కాబట్టి కులాన్ని అంత త్వరగా ఈ దేశం నుంచి తీసెయ్యలేమన్నారు. ఈ సందర్భంగా ఆమె నాలుగు సూచనలు చేశారు. కులం గురించి అడిగితే తెలియదని చెప్పడం, కుల ప్రస్తావన వస్తే వద్దని వారించడం, పుస్తకాలు చదవడం, పిల్లలకు మంచి అలవాట్లను నేర్పించడం.. మనలో మార్పు వస్తే.. రేపటి పౌరులను మార్చొచ్చని అభిప్రాయపడ్డారు చిన్మయి. ప్రస్తుతం ఆమె లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ముగిసిన ప్రణయ్ అంత్యక్రియలు...కన్నీటి వీడ్కోలు చెప్పిన అమృత

పెళ్లి వీడియో కంటే ప్రణయ్ హత్య వీడియోకే ఎక్కువ హిట్స్ వస్తాయి: మారుతీరావు హెచ్చరిక

ఆ మూడంటే ప్రణయ్‌కు ప్రాణం, చివరిక్షణాల్లో కూడ ...

ప్రణయ్ హత్యను ఖండించిన కేటీఆర్.. వారికి శిక్ష పడి తీరుతుంది

కిడ్నాప్ చేసినవాడితోనే ప్రణయ్ హత్యకు ప్లాన్?

నల్గొండ జిల్లాలో పరువు హత్యలు: నాడు నరేష్, నేడు ప్రణయ్

ప్రణయ్ హత్య: అబార్షన్ చేసుకోవాలని నాన్న ఒత్తిడి: అమృతవర్షిణీ

అమ్మ కంటే ప్రణయ్ బాగా చూసుకొన్నారు: అమృతవర్షిణీ

ప్రణయ్ హత్య: నాడు కిరోసిన్ దందా.. నేడు బిల్డర్, ఎవరీ మారుతీరావు?


 

click me!