హుజుర్‌నగర్ సమస్యలపై ఏనాడు ఉత్తమ్ నన్ను కలవలేదు: జగదీశ్ రెడ్డి

By Siva KodatiFirst Published Sep 22, 2019, 12:33 PM IST
Highlights

2014 తర్వాత హుజుర్‌నగర్‌కు సంబంధించిన ఏ సమస్యను కూడా తన వద్దకు గానీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి గానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకురాలేదని జగదీశ్ రెడ్డి గుర్తు చేశారు. అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి ఖండించారు. 

హుజూర్‌నగర్‌ ఉపఎన్నికల్లో సైదిరెడ్డి గెలుపు ఖాయమన్నారు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి. హైదరాబాద్‌లో సైదిరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన.. హుజూర్‌నగర్ నియోజకవర్గం వెనకబడటానికి కారణం ఉత్తమ్ కుమార్ రెడ్డినే అంటూ మండిపడ్డారు.

ఆయన ఏ ఒక్కరోజు కూడా నియోజకవర్గాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. ఉత్తమ్‌కు తమ పట్ల ఉన్న చులకన భావం, అభివృద్ధి పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని ప్రజలు గమనించారని మంత్రి వ్యాఖ్యానించారు.

2014 తర్వాత హుజుర్‌నగర్‌కు సంబంధించిన ఏ సమస్యను కూడా తన వద్దకు గానీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి గానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకురాలేదని జగదీశ్ రెడ్డి గుర్తు చేశారు.

అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి ఖండించారు. 2014 తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు హుజుర్‌నగర్ నియోజకవర్గంలో ఎలాంటి రాజకీయ కేసులు లేవని జగదీశ్ రెడ్డి గుర్తు చేశారు.

రాజకీయ కక్షలను కొట్లాటలను పెంచి పోసింది కాంగ్రెస్ పార్టీనేనని మంత్రి ఎద్దేవా చేశారు. హుజుర్‌నగర్‌లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని జగదీశ్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.     

హుజూర్ నగర్ కలకలం: తెలంగాణ కాంగ్రెసులో రేవంత్ రెడ్డి ఏకాకి

 

హుజూర్‌నగర్ బై పోల్: పోటీకి బీజేపీ సై

ఉత్తమ్ వ్యూహం: ఎల్ రమణకు ఫోన్, మద్దతు ఇవ్వాలని రిక్వస్ట్

హుజూర్ నగర్ ఉపఎన్నిక: అన్ని పార్టీలకు అత్యంత కీలకం ఎందుకంటే ...(వీడియో)

ఉత్తమ్ సతీమణి గెలుపు తథ్యం, స్టార్ల ప్రచారం అవసరం లేదు: జగ్గారెడ్డి

శానంపూడి సైదిరెడ్డి ఆంధ్రవాడా: ఉత్తమ్ కుమార్ రెడ్డి భాష్యం అదే

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: జానా రెడ్డి కొడుక్కి బీజేపీ గాలం

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డే

హుజుర్ నగర్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల : అక్టోబర్ 21న పోలింగ్

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: మళ్లీ తెర మీదికి కాసోజు శంకరమ్మ

జగదీష్ రెడ్డి వ్యాఖ్య: రేవంత్ రెడ్డితో మాట్లాడించింది ఉత్తమ్ కుమార్ రెడ్డే

హుజూర్ నగర్ అభ్యర్థి: అన్న మాటను కాదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ఈ మధ్యే వచ్చినోళ్ల సలహాలు అక్కర్లేదు: రేవంత్‌పై కోమటిరెడ్డి వ్యాఖ్యలు

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: కాంగ్రెసు అభ్యర్థి పద్మావతి, ఉత్తమ్ ప్రకటన

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: ఉత్తమ్ పద్మావతికి రేవంత్ రెడ్డి నిరసన సెగ

 

click me!