18న బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ

By narsimha lodeFirst Published Sep 22, 2019, 11:15 AM IST
Highlights

మాజీ  ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ బీజేపీలో చేరనున్నారు. ఈ మేరకు బీజేపీ నేతలు ఆమెను తమ పార్టీలో చేరాలని ఆహ్వానించారు. 

నిజామాబాద్: మాజీ ఎమ్మెల్యే ఏలేటీ అన్నపూర్ణమ్మ బీజేపీలో చేరనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ శనివారం నాడు అన్నపూర్ణమ్మతో భేటీ అయ్యారు.

అన్నపూర్ణమ్మ నివాసానికి వెళ్లి  పార్టీలో చేరాల్సిందిగా వారు ఆహ్వానించారు. అన్నపూర్ణమ్మ తనయుడు డాక్టర్ మల్లికార్జున్ రెడ్డిని కూడ బీజేపీలో చేరాలని  వారు కోరారు. ఈ నెల 18వ తేదీన అన్నపూర్ణమ్మ బీజేపీలో చేరే అవకాశం ఉందని సమాచారం.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  2009లో జరిగిన ఎన్నికల్లో అన్నపూర్ణమ్మ టీడీపీ అభ్యర్ధిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014 ఎన్నికల్లో ఆమె టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

అన్నపూర్ణమ్మను 2014 ఎన్నికలకు ముందు నుండి టీఆర్ఎస్ లో చేరాలని ఆ పార్టీ నేతలు ఆహ్వానిస్తున్నారు. కానీ ఆమె టీఆర్ఎస్ లో చేరలేదు. కానీ, ఆమె బీజేపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్టుగా ఆమె వర్గీయులు చెబుతున్నారు.

click me!