కరీంనగర్ పరువు హత్య: ఆదివారం నాడే కుమార్ మిస్సింగ్

By narsimha lodeFirst Published Oct 9, 2018, 12:01 PM IST
Highlights

కరీంనగర్ జిల్లా  శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన కుమార్  ఆదివారం రాత్రి 9 గంటల నుండి కన్పించకుండా పోయాడు.ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని  కుమార్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. 

కరీంనగర్: కరీంనగర్ జిల్లా  శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన కుమార్  ఆదివారం రాత్రి 9 గంటల నుండి కన్పించకుండా పోయాడు.ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని  కుమార్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.  పోలీసులు సకాలంలో స్పందిస్తే కుమార్ బతికేవాడని  కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 కరీంనగర్ జిల్లా శంకరపట్నం  మండలం తాడికల్ గ్రామానికి చెందిన కుమార్ ... వంకాయలపల్లెకు చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. వీరిద్దరికి కూడ పెళ్లి చేయాలని రెండు కుటుంబాలు నిర్ణయం తీసుకొన్నాయి. అయితే  కొంత కాలం క్రితం ఈ రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగినట్టు సమాచారం.

అయితే  ఈ గొడవ కారణంగానే  కుమార్‌ను  యువతి కుటుంబసభ్యులు హత్యచేసి ఉంటారని  మృతుడి  కుటుంబసభ్యులు  ఆరోపిస్తున్నారు.  కుమార్  అక్టోబర్ 7వ తేదీ రాత్రి నుండి అదృశ్యమయ్యాడు. అతని ఆచూకీ కోసం కుటుంబసభ్యులు  వెతికినా ప్రయోజనం లేకపోయింది.

అక్టోబర్ 8వ, తేదీ మధ్యాహ్నం వరకు వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో కుమార్ కుటుంబసభ్యులు  పోలీసులకు ఫిర్యాదు చేశారు.  అయితే పోలీసులు సకాలంలో స్పందించలేదని  మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన  తన తల్లిని, తనను  పోలీసులు  దూషించారని కుమార్ సోదరుడు ఆరోపించాడు.

ఈ విషయమై ఓ తెలుగున్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశాడు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే తన సోదరుడు బతికి ఉండేవాడని ఆయన అభిప్రాయపడ్డారు.  హంతకులతో పోలీసులు కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు. 

ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన  తనను ఎఎస్ఐ కాలర్ పట్టుకొని దూషించాడని  కుమార్ సోదరుడు ఆరోపించారు.  పోలీసుల నిర్లక్ష్యం వల్లే కుమార్ మరణించాడని బంధువులు, కుటుంసభ్యులు ఆరోపిస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

కరీంనగర్ పరువు హత్య: దీపావళి తర్వాత పెళ్లి, ఇంతలోనే.....

తెలంగాణలో మరో పరువు హత్య: యువకుడిని చంపిన అమ్మాయి బంధువులు

అమృతను కించపరుస్తూ కామెంట్...యువకుడు అరెస్ట్

అసభ్యకరమైన పోస్టులు.. పోలీసులకు అమృత ఫిర్యాదు

పోలీసులపై అనుమానం వ్యక్తం చేసిన ప్రణయ్ తండ్రి

ప్రణయ్ హత్య: ఎవరీ బారి...మారుతీరావుతో లింకు ఇలా...

నల్గొండ జిల్లాలో పరువు హత్యలు: నాడు నరేష్, నేడు ప్రణయ్

ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం

ప్రణయ్ విగ్రహం.. కోర్టు ఏమందంటే..

ప్రణయ్ హత్య: మారుతీరావు ఇంట్లో పోలీసుల సోదాలు

ఇంకా విషమంగానే: నాలుగు సర్జరీలు, ఐసీయూలోనే మాధవి

మాధవి కేసులో మందకృష్ణ మాదిగ అనుమానం ఏంటంటే

సైకోలా చేస్తాడనే పెళ్లి గురించి ముందే డాడీకీ చెప్పలేదు: మాధవి సోదరుడు

నా భార్యే కారణం, ఆమెనే చంపాల్సింది: మనోహారాచారి

ఇంకా మాధవి పరిస్థితి విషమంగానే: హెల్త్ బులెటిన్ విడుదల

'మూడు మర్డర్లు చేశాను... కానీ... మారుతీరావులా చేయను'

మాపై దాడికి ఆమె కారణం, మాధవికి బ్రెయిన్ వాష్ చేసేది: సందీప్ సంచలనం

తండ్రి దాడి: మాధవి పరిస్థితిపై ఇప్పుడే చెప్పలేమంటున్న డాక్టర్లు

ఎస్ఆర్ నగర్ దాడి: లొంగిపోయిన మనోహరాచారి, మాధవి పరిస్థితి విషమం

ఎస్ఆర్ నగర్ దాడి: నమ్మించి నవదంపతులను నరికిన అమ్మాయి తండ్రి

టెన్త్ క్లాస్‌ నుండే ప్రేమ: కులాంతర వివాహం నచ్చకే తండ్రి దాడి

నవదంపతులపై దాడి: బట్టలు పెడతామని పిలిచి ఘాతుకం (వీడియో)

ప్రణయ్ హత్య మరవకముందే.. నగరంలో మరో సంఘటన

click me!