వేణుమాధవ్ ప్రత్యేకత ఇదీ: నల్గొండ నుండి హైద్రాబాద్ కు ఇలా...

By narsimha lodeFirst Published Sep 25, 2019, 1:09 PM IST
Highlights

సినీ నటుడు వేణుమాధవ్ చదువు వెలుగు ఉద్యమం ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించారు. 

కోదాడ: ఉమ్మడి నల్గొండ జిల్లాలో చదువు వెలుగు ఉద్యమంలో వేణుమాధవ్  చురకుగా పాల్గొన్నారు.ఈ సమయంలో నల్గొండ జిల్లాలోని వందలాది గ్రామాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. మాట్లాడే బొమ్మ పేరుతో చదువు వెలుగు ఉద్యమంలో  వేలాది ప్రదర్శనలు ఇచ్చారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1989-90 కాలంలో అప్పటి జిల్లా కలెక్టర్ ఎన్ కె నరసింహారావు చదువు వెలుగు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక, ఆంద్రప్రజానాట్యమండలికి చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రదర్శనలు ఇచ్చేవారు. చదువు ఆవశ్యకతను తెలిపేవారు.

ఈ సమయంలో  చదువు ఆవశ్యకతను తెలిపేందుకు మాట్లాడే బొమ్మతో వేణుమాధవ్ ప్రదర్శనలు ప్రజల్లో మన్ననలు పొందాయి. ఆ సమయంలో ఆంధ్రప్రజానాట్యమండలికి చెందిన అంజన్న నేతృత్వంలో  వేలాది కళాకారులు  జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రదర్శనలు  నిర్వహించేవారు. చదువు ఆవశ్యకతను తెలుపుతూ వీధినాటికలు ప్రదర్శించేవారు.

అంజన్న నాయకత్వంలో పల్లెసుద్దులు, మన చరిత్ర,కురుక్షేత్రం, ఆగిపోని నాటిక అనే పేరుతో నాటికలు ప్రదర్శించారు.ఈ నాటికల్లో వేణుమాధవ్ నటించారు. మన చరిత్ర అనే నాటికలో వేణుమాధవ్ కానిస్టేబుల్ పాత్ర పోషించేవాడు.ఈ సమయంలో వేణుమాధవ్ నటన పలువురిని ఆకట్టుకొంది. మాట్లాడే బొమ్మ ద్వారా హస్యాన్ని జోడించి వేణుమాధవ్  ప్రదర్శనలు ఇచ్చేవాడు. ఈ ప్రదర్శనల కోసం జనం ఎగబడేవారు. 

ఆ తర్వాత వేణుమాధవ్ హైద్రాబాద్‌కు వచ్చాడు. అప్పటి కోదాడ ఎమ్మెల్యే చందర్ రావు ద్వారా వేణుమాధవ్ హైద్రాబాద్ కు చేరుకొని టీడీపీ కార్యాలయంలో కొంత కాలం పనిచేశాడు. ఆ తర్వాత సినిమాల్లోకి ప్రవేశించాడు. ఆనాడు హోం మంత్రిగా ఉన్న మాధవరెడ్డి సహకారంతో సినీ రంగ ప్రవేశం చేసినట్టుగా చెబుతారు.

 

సంబంధిత వార్తలు:

వేణుమాధవ్‌ మరణం ఇండస్ట్రీకి తీరని లోటు.. రాజశేఖర్ కామెంట్స్!

వేణుమాధవ్ మృతికి మహేష్ బాబు సంతాపం!

వేణుమాధవ్ జీవితాన్ని మార్చేసిన సంఘటన.. తొలి పారితోషికం ఎంతంటే!

మెగాస్టార్ కోసం రూల్ బ్రేక్ చేసిన వేణుమాధవ్!

'అప్పట్లో భుట్టో.. ఇప్పుడు ముషారఫ్'.. వేణుమాధవ్ మృతికి ప్రముఖుల సంతాపం!

బ్రేకింగ్: హాస్య నటుడు వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమం!

బ్రేకింగ్: ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత!

బూతులు ఉన్నాయనే సినిమాలు చేయలేదు.. వేణుమాధవ్!

ఛాన్సుల కోసం ఎవరినీ అడుక్కోను.. వేణుమాధవ్ కామెంట్స్!

కాలు మీద కాలేసి కూర్చున్నానని.. ఆ స్టార్ హీరో.. : వేణుమాధవ్!

వేణుమాధవ్ యూ టర్న్ రోల్స్.. నల్లబాలు నల్ల తాచు లెక్క

అభిమానుల సందర్శనార్ధం వేణుమాధవ్ పార్థివదేహం.. రేపే అంత్యక్రియలు

వేణుమాధవ్ కి ఎంత ఆస్తి ఉందో తెలుసా..?

వేణుమాధవ్ ఇంటిపై ఉండే దర్శకుల పేర్లు ఎవరివంటే..?

 

 

click me!