ఎట్టకేలకు మర్రి, పొన్నాల సీట్లకు లైన్‌క్లియర్

By narsimha lodeFirst Published Nov 16, 2018, 2:51 PM IST
Highlights

మాజీ మంత్రి, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు జనగామ సీటును  ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం  అంగీకరించింది.

హైదరాబాద్: మాజీ మంత్రి, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు జనగామ సీటును  ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం  అంగీకరించింది.ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పలు దఫాలు పొన్నాల లక్ష్మయ్య పోటీ చేసి విజయం సాధించారు. 

2014 ఎన్నికల్లో కూడ పొన్నాల లక్ష్మయ్య  కాంగ్రెస్ పార్టీ తరపున జనగామ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ సమయంలో ఆయన పీసీసీ చీఫ్ గా కూడ ఉన్నారు.అయితే ప్రజాకూటమి( మహాకూటమి) పార్టీలోని భాగస్వామ్య పార్టీల మధ్య  సీట్ల సర్దుబాటులో భాగంగా  జనగామ సీటును టీజేఎస్  చీఫ్ కోదండరామ్ కోరుకొన్నాడు. కానీ, కాంగ్రెస్ పార్టీ చీఫ్  రాహుల్ గాంధీతో కోదండరామ్  గురువారం రాత్రి  సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో జనగామ సీటును  వదులుకోవాలని  రాహుల్ గాంధీ కోదండరామ్‌ను కోరినట్టు సమాచారం.ఈ సమావేశంలో జనగామ సీటును కాంగ్రెస్ పార్టీకి వదిలేసేందుకు  ఒప్పుకొన్నట్టు సమాచారం.  శుక్రవారం ఉదయాన్నే కోదండరామ్ హైద్రాబాద్‌కు వచ్చారు.

జనగామ సీటును పొన్నాలకు ఇవ్వకుండా కోదండరామ్‌కు కేటాయిస్తే  బీసీ వర్గాల్లో  తీవ్ర అసంతృప్తి ఉంటుందని  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావించింది. ఈ మేరకు కోదండరామ్‌ను  రాహుల్ గాంధీని ఒప్పించినట్టు సమాచారం. 

మరోవైపు సనత్‌నగర్ నుండి   మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డిని  కూడ  కాంగ్రెస్ పార్టీ లైన్ క్లియర్  చేసినట్టు  సమాచారం.  ఈ ఇద్దరు కాంగ్రసె్ సీనియర్లకు కాంగ్రెస్ పార్టీ  గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది.

 కాంగ్రెస్ పార్టీ  19 అసెంబ్లీ స్థానాల్లో పెండింగ్‌లో ఉన్న అభ్యర్థుల పేర్లను  ఆ పార్టీ శనివారం నాడు ప్రకటించనుంది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించే తుది జాబితాలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు  పొన్నాల లక్ష్మయ్యతో పాటు మర్రి శశిధర్ రెడ్డి పేర్లు ఉంటాయని తెలుస్తోంది.అయితే జాబితా ప్రకటించే సమయానికి జనగామ సీటు విషయమై టీజేఎస్ చీఫ్ కోదండరామ్ తో చర్చించాలని  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం షరతు విధించిందనే ప్రచారం కూడ లేకపోలేదు. 

సంబంధిత వార్తలు

మహాకూటమికి సెగ: ఢీకొట్టేందుకు రెబెల్స్ కూటమి

రాహుల్ ఇంటి ముందు బండ కార్తీక్ రెడ్డి బైఠాయింపు

రూ. 10 కోట్లు తీసుకొని దానంపై దాసోజుకు టికెట్టు: క్యామ మల్లేష్ సంచలనం

శంషాబాద్ పార్టీ కార్యాలయం వద్ద కార్తీక్ రెడ్డి వీరంగం...

కాంగ్రెస్‌కు సబిత తనయుడు కార్తీక్ రెడ్డి రాజీనామా

రాజేంద్రనగర్‌లో రెబెల్‌గా సబితా తనయుడు
కాంగ్రెస్‌కు సబిత తనయుడు కార్తీక్ రెడ్డి రాజీనామా

కాంగ్రెస్ మూడో జాబితా: పొన్నాలకు క్లియర్, జానా కొడుక్కి టికెట్టు

కోదండరామ్ ఎలా గెలుస్తాడో చెప్పండి: పొన్నాల సవాల్

పొన్నాలకు దక్కని టికెట్ ... కార్యకర్త ఆత్మహత్యాయత్నం

కాంగ్రెస్ రెండో జాబితా: తేలని పొన్నాల సీటు

జనగామ నుండి తప్పుకొన్న కోదండరామ్: పొన్నాలకు లైన్‌క్లియర్

జనగామ టికెట్ నాదే..ధీమా వ్యక్తం చేసిన పొన్నాల

కంగు తిన్న పొన్నాల: హుటాహుటిన ఢిల్లీకి పయనం

పొన్నాలకు షాక్: జనగామ నుంచి కోదండరామ్ కే చాన్స్

జనగామ పొన్నాలకే... హైకమాండ్ రహస్య సంకేతాలు: ఆ వర్గానికి షాక్

కన్నీళ్లు పెట్టుకున్న పొన్నాల లక్ష్మయ్య

జనగాం నుంచి కోదండరామ్ పోటీ: పొన్నాల ఆగ్రహం, టచ్ లో హరీష్

జనగామలో పొన్నాలకు కోడలు చిక్కులు

పొన్నాలకు కాంగ్రెస్ నేతల షాక్

పొన్నాలకు కోమటిరెడ్డి పొ

click me!